Andhra Pradesh: ఏపీలో మూడు కొత్త మెడికల్ కాలేజీల(Medical Colleges) ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నంలో నూతన వైద్య కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రాజ్యసభ(Rajya Sabha)లో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి(Vijaya Sai Reddy) అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 13 వైద్య కళాశాలలు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. అంతేకాకాకుండా ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద తిరుపతి శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌, విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల, అనంతపురం వైద్య కళాశాలలు అభివృద్ధి చేస్తాం’ అని కేంద్రం(Central Govt) స్పష్టం చేసింది. 


Also Read: Andhra Pradesh: ఏపీలో వృద్ధాప్య పింఛను పెంపు..జనవరి 1 నుంచి అమలు..


విశాఖపట్నం పోర్టు(Visakhapatnam Port)కు  సంబంధించిన ఖాళీలపై విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు పోర్టుల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ సమాధానమిచ్చారు. విశాఖ పోర్టులో మొత్తం సిబ్బంది సంఖ్య 4,003 ఉండగా 1,112 పోస్టులు(Posts) ఖాళీగా ఉన్నాయని మంత్రి తెలిపారు. విశాఖపట్నం పోర్టుతోపాటు దేశంలోని మేజర్‌ పోర్టులలో సిబ్బంది సంఖ్య అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు మంత్రి చెప్పారు. అందువలన మేజర్‌ పోర్టులలో సిబ్బందిని అవసరం మేరకు మాత్రమే ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link -https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook