కేంద్ర నౌకాయాన, జలవనరుల, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఆయన జులై 11 నుంచి  13 వరకు మూడు రోజులపాటు ఏపీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా తొలిరోజు ఆయన పోలవరం ప్రాజెక్ట్‌ను ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ఆతరువాత విశాఖపట్టణం నగరంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. విశాఖలో సుమారు 6 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన పలు రోడ్డు ప్రాజెక్ట్‌లకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ఎంపీ హరిబాబు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలోని వివిధ రహదారి అనుసంధాన ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గడ్కరీ పోలవరం సందర్శన


[[{"fid":"171316","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"పోలవరం ప్రాజెక్ట్","field_file_image_title_text[und][0][value]":"పోలవరం ప్రాజెక్ట్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"పోలవరం ప్రాజెక్ట్","field_file_image_title_text[und][0][value]":"పోలవరం ప్రాజెక్ట్"}},"link_text":false,"attributes":{"alt":"పోలవరం ప్రాజెక్ట్","title":"పోలవరం ప్రాజెక్ట్","class":"media-element file-default","data-delta":"1"}}]]


[[{"fid":"171318","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"పోలవరం ప్రాజెక్ట్ వ్యూ","field_file_image_title_text[und][0][value]":"పోలవరం ప్రాజెక్ట్ వ్యూ"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"పోలవరం ప్రాజెక్ట్ వ్యూ","field_file_image_title_text[und][0][value]":"పోలవరం ప్రాజెక్ట్ వ్యూ"}},"link_text":false,"attributes":{"alt":"పోలవరం ప్రాజెక్ట్ వ్యూ","title":"పోలవరం ప్రాజెక్ట్ వ్యూ","class":"media-element file-default","data-delta":"2"}}]]


[[{"fid":"171319","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"పోలవరం పనులు","field_file_image_title_text[und][0][value]":"పోలవరం పనులు"},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"పోలవరం పనులు","field_file_image_title_text[und][0][value]":"పోలవరం పనులు"}},"link_text":false,"attributes":{"alt":"పోలవరం పనులు","title":"పోలవరం పనులు","class":"media-element file-default","data-delta":"3"}}]]


కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేడు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు. నేడు ఆయన రాజమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గంలో పోలవరం ప్రాజెక్ట్ వద్దకు చేరుకోనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను కేంద్ర మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.


విశాఖలో గడ్కరీ జులై 11 నుంచి 13 వరకు పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ సందర్శన అనంతరం విశాఖలో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశంలో గడ్కరీ పాల్గొననున్నారు. జులై 12, 13 తేదీల్లో విశాఖలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. అలానే పలు ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు.


11వ తేదీన పోలవరం పరిశీలనకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రానున్నట్లు భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. సవరించిన పోలవరం అంచనాలను కేంద్రానికి పంపామన్నారు. రూ.57 వేల కోట్లతో అంచనాలను సవరించి కేంద్రానికి సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. 2013 చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాసం అంచనాలు పెంచాయని, అంచనాలు 3 వేల కోట్ల నుంచి 33 వేల కోట్లకు పెరిగినట్లు తెలిపారు. పోలవరం సందర్శనకు వచ్చే గడ్కరీని తక్షణమే 10 వేల కోట్లను విడుదల చేయాలని కోరుతామన్నారు.