చంద్రబాబు Vs కన్నా : టీడీపీ -బీజేపీ పోటా పోటీ ర్యాలీలతో ఏపీ రాజధానిలో ఉద్రిక్త వాతావరణం
ఏపీలో టీడీపీ - బీజేపీ మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకొని..నిరసన ర్యాలీల వరకు వెళ్లింది
నవ్యాంధ్ర రాజధాని గుంటూరులో టీడీపీ -బీజేపీ పోటా పోటీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సీఎం కాన్వయ్ ను అడ్డుకోవడంపై టీడీపీ నిరసన ప్రదర్శన చేయారు. పట్టణంలోని లాడ్డి సెంటర్ నుంచి శంకర్ విలాస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంలో ప్రధాని మోడీ , ఏపీ పీసీసీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. కన్నా ఇంటి ముట్టడికి బయలుదేరాలు.
టీడీపీకి ధీటుగా బీజేపీ ర్యాలీ
టీడీపీ ర్యాలీ నేపథ్యంలో బీజేపీ కూడా పోటీ ర్యాలీ నిర్వహించింది. బీజేపీ చీఫ్ కన్నా ఇంటి నుంచి మార్కెట్ సెంటర్ వరకు బీజేపీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంలో టీడీపీ, ముఖ్యంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు..కాగా ఈ పోటా పోటీ నిరసన ర్యాలీలతో గుంటూరు పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాగా నిరసన ప్రదర్శన కారణంగా ట్రాఫిక్ అస్తవ్యస్థంగా మారింది. దీంతో సామాన్య జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు
తారా స్థాయికి టీడీపీ- బీజేపీ వార్
బీజేపీ-టీడీపీ నేత వార్ రోజులు గడిచే కొద్ది ముదురుతోంది. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధుల విషయంలో మోడీ సర్కార్ చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలె కాకినాడ సభకు హాజరౌతున్న సమయంలో చంద్రబాబు కాన్వాయ్ ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాకినాడను స్మార్ సిటీ చేస్తానని..కనీసం రోడ్లు కూడా వేయలేకపోయారని కమలం పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ, చంద్రబాబు వ్యతిరేక నినాదాలు చేశారు. పోలీసుల రంగ ప్రవేశం పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ సంధర్భంలో చంద్రబాబు మాట్లాడుతూ బీజేపీని ఫినిష్ చేస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా చంద్రాబాబు కాన్వాయ్ అడ్డుపడినందుకు నిరసనగా టీడీపీ ఈ రోజు బీజేపీ చీఫ్ ఇంటి వద్ద నిరసన ర్యాలీ నిర్వహించగా..అందుకు దీటుగా బీజేపీ కూడా చంద్రబాబుకు వ్యతిరేక ర్యాలీ నిర్వహించింది. తనను చంపేందుకే చంద్రబాబు ఇలా టీడీపీ కార్యకర్తలు ఉసిగొల్పారని విమర్శించారు. తాజా పరిణామాల నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది