Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నేతృత్వంలోని నేతల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌(President Ram Nath Kovind)ను కలిసింది. ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లుతోందని, గంజాయి సాగు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోందని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల తెదేపా కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఏక కాలంలో జరిగిన దాడులను వివరించినట్లు సమాచారం.అలాగే ఇతర ముఖ్యనేతలను కూడా కలవనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Grama Ward Sachivalayam Salary: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్​.. అక్టోబరు జీతాల్లో కోత!


తెదేపా కార్యాలయాల(Tdp offices)పై దాడులు, డ్రగ్స్ వ్యవహారం, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, అమిత్ షా, గవర్నర్‌కు లేఖలు రాశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిలైందని.. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తోంది టీడీపీ(TDP). అలాగే టీడీపీ ఆఫీస్‌పై దాడిని ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతోంది. రాష్ట్రపతికి కూడా ఇవే అంశాలపై ఫిర్యాదు చేయనున్నారు. రెండు రోజుల పాటు హస్తినలోనే మకాం వేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), అమిత్ షా అపాయింట్ మెంట్స్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. వీలైతే మరి కొందరు కేంద్ర పెద్దలను కలవాలని భావిస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook