Chandrababu Case Updates: చంద్రబాబుకు ఊరట, మద్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కాస్త ఊరట లభించింది. ఆరోగ్య. కారణాలతో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఎట్టకేలకు ఊరట లభించింది. నాలుగు వారాల బెయిల్ ఇది. తిరిగి నవంబర్ 28న సరెండర్ కావల్సి ఉంటుంది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో రిలీఫ్ లభించింది. 52 రోజుల తరువాత మద్యంతర బెయిల్ పై బయటకు రానున్నారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్‌పై తీర్పుకు ముందే స్వల్ప ఊరట లభించింది. చంద్రబాబు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మద్యంతర బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. ఆయన కుడి కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ నిర్వహించాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసి ఇవాళ వెలువరించింది.
చంద్రబాబుకు మద్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు కొన్ని షరతులు విధించింది. ఇది ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ అయినందున మీడియా, రాజకీయ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనకూడదని, ఆసుపత్రి మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాలుపంచుకోకూడదని కోర్టు తెలిపింది.
ఆరోగ్య కారణాల దృష్ట్యా ముఖ్యంగా కంటి ఆపరేషన్ దృష్టిలో ఉంచుకుని నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 28 సాయంత్రం 5 గంటలకు తిరిగి కోర్టులో సరెండర్ కావల్సి ఉంటుంది. సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అరెస్ట్ అయిన తరువాత నవంబర్ 10 సాయంత్రం నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. 52 రోజుల తరువాత ఇవాళ ఆరోగ్య కారణాలతో చంద్రబాబుకు మద్యంతర బెయిల్ మంజూరైంది. రెగ్యులర్ బెయిల్ పిటీషన్ విచారణను నవంబర్ 10వ తేదీకు వాయిదా వేసింది. బెయిల్ కండీషన్ల గురించి పూర్తి వివరాలు రావల్సి ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook