Chandrababu Case Updates: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసులో ఇవాళ కీలక పరిణామం జరగవచ్చని అంచనా ఉంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై ఇవాళ జరిగే విచారణలో ఏం తేలనుందనేది ఆసక్తి రేపుతోంది. తీర్పు వెలుడనుందా లేక మరోసారి వాయిదా పడుతుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తొలుత ఈ కేసులో తన అరెస్ట్ అక్రమమని, కొట్టివేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై సుదీర్ఘ వాదనల అనంతరం ఏసీబీ కోర్టు ఆ పిటీషన్ కొట్టివేసింది. దాంతో ఏపీ హైకోర్టులో సవాలు చేశారు. అక్కడ కూడా చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాదులు పెద్దఎత్తున వాదనలు విన్పించినా ప్రయోజనం లేకపోయింది. ఏపీ హైకోర్టు కూడా క్వాష్ కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 


సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ద్విసభ్య ధర్మాసనం ఈ కేసు విచారిస్తోంది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్ధ్ లూధ్రా వాదనలు విన్పించగా సీఐడీ తరపున ముకులు రోహత్గీ వాదిస్తున్నారు. ఇప్పటికే 3-4 రోజులు ఈ కేసు విషయంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇవాళ విచారణ వాయిదా పడటంతో మరోసారి ఆసక్తి రేపుతోంది. ఇవాళ్టితో ఈ కేసులో వాదనలు ముగిసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో క్వాష్ పిటీషన్‌పై ఇవాళే తీర్పు వెలువడుతుందా లేక తీర్పు రిజర్వ్ అవుతుందా అనే ఉత్కంఠ రేగుతోంది. ఎందుకంటే అక్టోబర్ 20 నుంచి సుప్రీంకోర్టుకు దసరా సెలవులున్నాయి. ఇప్పుడు తీర్పు రాకపోతే ఇక నవంబర్ 1నే తిరిగి ఈ కేసు విషయం తేలే అవకాశాలున్నాయి. 


చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై ఇచ్చే తీర్పు భవిష్యత్తులో చాలా తీర్పులకు ఉదాహరణ కావచ్చు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనే విషంయపై మొత్తం కేసు ముడిపడి ఉంది. సెక్షన్ 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదిస్తుంటే, వర్తించదని సీఐడీ చెబుతోంది. 


Also read: Ap Government: జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఫెయిల్ అయినా మళ్లీ పదో తరగతిలో చేరవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook