ఈవీఎలం మొరాయింపు సమస్యపై  ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు . రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభించి 3 గంటలైనా దాదాపు 30 శాతం ఈవీఎంలు పనిచేయక పోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు.  ఎన్నికల సంఘం దీనిపై స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈవీఎల పనితీరుపై అనుమానం


ఇదే సందర్భంలో టీడీపీకి ఓటు వేస్తే వైసీపీ పడుతున్నట్లు అనేక  ఫిర్యాదులు అందాయని లేఖలో పేర్కొన్నారు.. నిజంగా  ఇది చాలా దురదృష్టకర పరిణామమన్నారు. వీటిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలు తేడాగా ఉన్న చోట రీపోలింగ్ చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. 


పరస్పర ఆరోపణలు


రాష్ట్రం వ్యాప్తంగా ఈవీఎలం మొరాయింపు ఇస్తున్న విషయం తెలిసిందే... వీవీ ప్యాట్లలో తాము ఎవరికి ఓటు వేశారో ఓటర్లు కనిపించకపోవడంతో రాజకీయ పార్టీలు ఒకరి మరోకరు ఆరోపణలు సంధించుకుంటున్నాయి. మంగళరిగి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొనడంతో టీడీపీపై వైసీపీ అభ్యర్ధి ఆరోపించిన విషయం తెలిసిందే.. ఇదే క్రమంలో ఇప్పుడు చంద్రబాబు కూడా వైసీపీపై ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు