వైసీపీ -బీజేపీ చీకటి ఒప్పందం మరోమారు బయటపడిందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు.  ఐబీ చీఫ్, ఎస్పీల బదిలీ అంశంమే ఇందుకు నిదర్శన్నమన్నారు.  పార్టీ శ్రేణులతో బుధవారం ఉదయం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తన భద్రతను పర్యవేక్షించే ఐబీ చీఫ్ ను ఆకస్మాత్తుగా బదిలీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని  ప్రశ్నించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివేక హత్య కుట్ర బయపడుతుందనే బదిలీ...
ఇదే సందర్భంలో వివేకా హత్య కేసును విచారణ జరగుతున్న సమయంలో కడప జిల్లా ఎస్పీని బదిలీ ఎందుకు చేయాల్సి వచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. బాబాయి వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన సాక్ష్యాలన్నీ మాయం చేసిన జగన్.. ఆ తర్వాత సీబీఐ విచారణ కోరారని.. రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపితే  అసలు నిజాలు బయటకొచ్చేఅవకాశమున్నందున  మోడీ సర్కార్ కు జగన్ ప్రాధేయపడి ఎస్పీని బదిలీ చేయించారని చంద్రబాబు దుయ్యబట్టారు. 


కేంద్రం కుట్రలను ధీటుగా ఎదుర్కొంటాం...
ఏ కారణంతో చేత ఈ బదిలీలు చేశారో కేంద్రం సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ జగన్ తో కలిసి మోడీ సర్కార్ కుట్రలకు పాల్పడుతోందని చంద్రబాబు విమర్శించారు. టీపీపీపై రోజు రోజుకూ కుట్రలు పెరిగిపోతున్నా.. దేనికీ భయపడేది లేదని తేల్చి చెప్పారు. టీడీపీ కార్యకర్తలు కూడా ఎక్కడా వెనక్కి తగ్గొద్దని దిశానిర్దేశం చేశారు. ప్రజలు తెదేపా వైపు ఉన్నంత వరకూ ఎవరి కుట్రలూ సాగవని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను సవాలుగా మలచుకొని.. రాబోయే ఎన్నికల్లో భారీ విజయం సాధిద్దామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. 


జగన్ ఫిర్యాదు మేరకు బదిలీలు...
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌, ఇద్దరు ఎస్పీల బదిలీ చేస్తూ మంగళవారం ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును విధుల నుంచి తప్పించిన ఈసీ.... ఆయనతో పాటు కడప ఎస్పీ రాహుల్ దేవ్, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంను సైతం బదీలీ చేసింది.  ఐపీఎస్ ఉన్నతాధికారుల సాయంతో ఎన్నికల్లో లబ్ధి అభ్యర్ధులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ముగ్గురు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ మేరకు స్పందించారు. జగన్ కోరితే బదిలీలు చేస్తారా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు.