అమరావతి: ఏపీలో కరోనావైరస్ పెరగడం వెనుక ఏపీ సర్కార్ నిర్లక్ష్య వైఖరి ఉందని ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఏపీ ప్రభుత్వం కరోనావైరస్ పరీక్షలు సరిగ్గా చేయడం లేదని.. ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయకపోవడం వల్లే కరోనావైరస్ ఎక్కువగా వ్యాపించిందని అన్నారాయన. లోకల్ ట్రాన్స్‌మిషన్‌ ద్వారానే వైరస్ వేగంగా వ్యాపిస్తోందన్న చంద్రబాబు... లోకల్ ట్రాన్స్‌మిషన్‌ను నిరోధించకపోతే ఆ తర్వాత వైరస్ వ్యాప్తిని అరికట్టడం కష్టం అవుతుందని అన్నారు. రాష్ట్రంలో కరోనా పరీక్షా కేంద్రాలు తక్కువగా ఉన్నాయి. అవి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జూమ్ ఆన్‌లైన్ యాప్ ద్వారా మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : 3.2 లక్షల మంది కరోనా రోగుల కోసం 20,000 బోగీలతో ఐసోలేషన్ వార్డులు


స్వీయ నియంత్రణ ద్వారానే కరోనాను కట్టడి చేయొచ్చు అని చెబుతూ.. దేశ ప్రధాని పిలుపుమేరకు ప్రజలందరూ భౌతికదూరం (social distancing) పాటించాల్సిందిగా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి. ప్రజల్లో చైతన్యం వచ్చే వరకు లాక్‌డౌన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి. 


Read also : Corona cases in AP: ఏపీలో మరో 17 కరోనా కేసులు


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 9 లేఖలు రాశామన్న చంద్రబాబు.. ప్రభుత్వాలు ప్రజల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని.. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని అన్నారు. పేదలకు ప్రతి ఇంటికి రూ.5 వేలు ఇవ్వాలని కోరాం. అలాగే అన్ని రకాల పింఛన్లు కూడా ఇళ్ల వద్దకే తీసుకెళ్లి ఇవ్వాలి. రాష్ట్రంలో సంచార కూరగాయల మార్కెట్లు పెంచాలి అని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..