Palla Srinivas Yadav: జరుగుతున్న ప్రచారం వాస్తవమైంది. ఎన్నికల్లో అత్యధిక మెజార్టీనే అతడికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు వచ్చేలా చేసింది. ఈ మేరకు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలను పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు అప్పగించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్‌ వైఎస్సార్‌సీపీ హయాంలో నాటి ప్రభుత్వం చేసిన మోసాలు, తప్పిదాలపై అలుపెరగని పోరాటం చేశారు. నాటి ప్రభుత్వ వేధింపులను తట్టుకుని నిలబడి అద్భుత మెజార్టీతో గెలుపొందిన శ్రీనివాస్‌ పార్టీ అధ్యక్ష పదవికి అర్హుడని భావించారు. దీంతో ఏపీ పార్టీ బాధ్యతలను శ్రీనివాస్‌కు అప్పగిస్తూ చంద్రబాబు నిర్ణయంచి ప్రకటన విడుదల చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Amaravati: ఆంధ్రప్రదేశ్‌కు రూ.లక్ష కోట్లతో రాజధాని అమరావతి నిర్మాణం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ నూతన అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్‌ను చంద్రబాబు నియమించారు. మరోసారి ఉత్తరాంధ్రకి చెందిన బీసీ నాయకుడికి ఈ పదవి దక్కడం విశేషం. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్న అచ్చెన్నాయుడుపై పార్టీ ప్రశంసల వర్షం కురిపించింది. ప్రస్తుతం అచ్చెన్నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

Also Read: Chandrababu: ముఖ్యమంత్రి అయ్యి 24 గంటలు కాలేదు.. అప్పుడే చంద్రబాబుపై ప్రశంసల వర్షం


ఎవరు పల్లా?
అధ్యక్షుడిగా నియమితుడైన పల్లా శ్రీనివాస్‌ రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన తండ్రి తెలుగుదేశం పార్టీలో పని చేశారు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన పల్లా శ్రీనివాస్‌ అనూహ్యంగా ప్రజారాజ్యంతో రాజకీయ జీవితం ప్రారంభించారు. 2009లో ప్రజారాజ్యం నుంచి విశాఖపట్టణం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి 2014లో గాజువాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం మరోసారి 2019లో పోటీ చేయగా ఓడిపోయారు. తర్వాత విశాఖపట్టణం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితలయ్యారు. ఓడినా కూడా శ్రీనివాస్‌ ప్రజల మధ్య ఉన్నారు. నాటి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురి చేసినా తట్టుకుని నిలబడ్డారు. అంతేకాకుండా వైఎస్సార్‌సీపీలోకి చేరాలని ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. వినకపోతే వ్యక్తిగతంగా దాడులకు పాల్పడ్డారు. అయినా శ్రీనివాస్‌ లొంగలేదు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న అతడి భార్య ద్వారా కూడా ఒత్తిడి, వేధింపులకు పాల్పడ్డినా శ్రీనివాస్‌ టీడీపీతోనే కొనసాగారు. ప్రత్యేక హోదా కోసం దీక్ష చేయగా.. నాటి జగన్‌ ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంది. ఇవన్నీ శ్రీనివాస్‌లో పోరాట పటిమను పెంచాయి.


ఇక 2024లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గాజువాక నుంచి పోటీ చేసి పల్లా శ్రీనివాస్‌ యాదవ్‌ అఖండ మెజార్టీతో గెలుపొందారు. 95,235 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై విజయం సాధించారు. పోరాటమే అతడిని నాయకుడిగా నిలబెట్టింది. ఇప్పుడు ఏకంగా అధికారంలో ఉన్న పార్టీకి అధ్యక్షుడిగా నియమితులు కావడం విశేషం.



 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి