ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి విదేశీ పర్యటన తేదీలు ఖరారయ్యాయి.  ఉన్నతస్థాయి బృందంతో కలిసి ఆయన అక్టోబర్ 17 నుండి 26 వరకు యూఎస్, యూఏఈ, లండన్ లలో పర్యటించనున్నారు. చంద్రబాబు బృందం మొదట అమెరికాకు వెళ్తారు. అక్కడ అయోవా విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తారు. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ బహుమతి ప్రదానోత్సవ కార్యాక్రమంలో పాల్గొంటారు. తరువాత మూడు రోజుల పర్యటనకుగానూ యూఏఈ వెళ్లనున్నారు. చివరగా లండన్ లో రాజధాని ఆకృతులపై నార్మన్, ఫోస్టర్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైతారు. అలానే గోల్డెన్ పీకాక్ అవార్డు బహుమతి ప్రదానోత్సవ కార్యాక్రమానికి హాజరవుతారు.