Chandrababu Naidu: ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాతి రోజు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు సతీమణి భువనేశ్వరితో కలిసి పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రిని ఐఏఎస్‌, ఐపీఎస్‌తోపాటు సచివాలయ అధికారులు, ఉద్యోగులు కలిశారు. అయితే కొందరు అధికారులకు చంద్రబాబు భారీ ఝలక్‌ ఇచ్చారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Jagan: శాసన మండలినే జగన్‌ అడ్డా.. చంద్రబాబుపై పోరాడుదామంటూ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం


 


గత ప్రభుత్వంలో పెత్తనం చేసిన అధికారుల నుంచి పూల బొకేలు అందుకోవడానికి చంద్రబాబు తిరస్కరించారు. శుభాకాంక్షలు తెలుపుతూ ప్రవీణ్‌ ప్రకాష్, శ్రీ లక్ష్మీ, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు పుష్పగుచ్చాలు ఇవ్వగా చంద్రబాబు తీసుకోలేదు. ఈ సందర్భంగా సమావేశంలో వారిపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'గడిచిన ఐదేళ్లలో కొందరు ఐఏఎస్‌ల తీరు చాలా బాధించింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఇలా వ్యవహరిస్తారని ఎప్పుడూ అనుకోలేదు' అని పేర్కొన్నారు. ఐదేళ్లలో వ్యవహరించిన తీరుపై అధికారులు ఆత్మ సమీక్ష చేసుకోవాలని హితవు పలికారు.

Also Read: Amaravati Movement: బాబు ప్రమాణంతో 1,631 రోజుల ఉద్యమానికి బ్రేక్‌.. ఊపిరి పోసుకున్న అమరావతి


 


అనంతరం అధికారులతో చంద్రబాబు కాసేపు మాట్లాడారు. '1995లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాను. నాడు నాతో పని చేసిన వారిలో కొందరు నేడు ఇక్కడ ఉండి ఉంటారు. నాలుగోసారి ఇప్పుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్నా. రాష్ట్రంలో నేడు చూసిన దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్  అనేవి అత్యంత గౌరవప్రదమైన ఉద్యోగాలు. ఒక రాష్ట్రంతో సంబంధం లేకుండా వివిధ రాష్ట్రాల నుంచి నియామకం అవుతారు' అని వివరించారు.


'ఇక్కడ ఉన్న కొందరు అధికారులు గతంలో ఆదర్శవంతంగా పని చేశారు. కానీ ఐదేళ్లలో మాత్రం ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలి. పరిపాలన ఇంత అన్యాయంగా తయారవుతుందని ఎప్పుడూ ఊహించలేదు. శాఖలన్నీ నిస్తేజమయ్యాయి. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి' అని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టం మేరకే ఎవరైనా పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పరిపాలన గాడిలో పెట్టే విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటానని.. త్వరలో మళ్లీ అందరితో మాట్లాడతా...పాలనను చక్కదిద్దుతా అని తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter