AP Pension Scheme: ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి ప్రజల మనసులు గెలుచుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు హామీలు నెరవేర్చే పనిలో నిమగ్నమైంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూనే ఐదు కీలకమైన హామీలపై తొలి సంతకం చేశారు. వాటిలో పింఛన్ల పెంపు ఉంది. ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకట్టుకున్న హామీల్లో పింఛన్ల పెంపు ఒకటి. వచ్చే నెల నుంచి పింఛన్ల పెంపును అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే పింఛన్ల పెంపుతో జూలై నెలలో పింఛన్‌దారులకు ఒక్కొక్కరికి రూ.7 వేలు అందనున్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Hyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆది


 


ఏప్రిల్‌ నుంచే పింఛన్లు పెంచుతామని ఎన్నికల ప్రచారం చెప్పారు. చెప్పిన మాట ప్రకారం జూలై ఒకటో తేదీన పెంచిన ఫించన్‌ మొత్తం అందించనున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళలకు జగన్‌ ప్రభుత్వం రూ.3 వేలు పింఛన్‌ ఇవ్వగా ఇప్పుడు చంద్రబాబు రూ.వెయ్యి పెంచి రూ.4 వేలు అందించనున్నారు. ఈ లెక్కన ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు పెంచిన రూ.వెయ్యి చొప్పున రూ.3 వేలతోపాటు.. రూ.4 వేలు పించన్‌ ఇస్తారు. అంటే జూలై నెలలో ఒక్కో పింఛన్‌ లబ్ధిదారులు అందుకునేది రూ.7 వేలు. దీంతో పించన్‌దారులు చాలా ఆనందంలో ఉన్నారు.

Also Read: Adudam Andhra: ఆడుదాం ఆంధ్రా పనికి మాలిన ప్రోగ్రామ్‌.. రోజా అవినీతిని కక్కిస్తాం


 


ఇంటివద్దకే..
గత ప్రభుత్వం మాదిరే కూటమి ప్రభుత్వం కూడా లబ్ధిదారుల గడపకే పింఛన్‌ అందించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని లబ్ధిదారుల ఇంటికి పంపించి ఫించన్‌ డబ్బులు ఇవ్వనున్నారు. అయితే పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు ఇదే విషయాన్ని మంత్రివర్గానికి చెప్పారు. జూలై ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు కూడా పాల్గొననున్నారని సమాచారం. 


తీవ్ర ఆర్థిక భారం
కాగా పింఛన్ల పెంపుతో ప్రభుత్వానికి ఆర్థిక భారం తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే పింఛన్లు దాదాపు 60 లక్షల మందికి పైగా ఇస్తున్నారు. ఇప్పుడు రూ.7 వేల చొప్పున లబ్ధిదారులకు ఇవ్వాలంటే ప్రభుత్వానికి అదనపు భారం పడింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు మొదట పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. నిధులను సర్దుబాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter