ఢిల్లీ టూర్ లో భాగంగా టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు  బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలను ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు. నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయన ఉదయం నుంచి వివిధ వివిధ పార్టీల నాయకులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ , నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. సాయంత్రం రాహుల్ గాంధీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. కాగా రాహుల్ భేటీలో తెలంగాణ ఎన్నికల్లో పొత్తు అంశంమే ప్రధానమైనప్పటికీ.. ఈ భేటీలో  జాతీయ రాజకీయాల పై కూడా సుదీర్ఘ చర్చ జరిగే అవకాశముంది .ఇలా ఉండగా రేపు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్, లోక్ జనతాదళ్ చీఫ్ శరద్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతిలతో శనివారం భేటీ కానున్నారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీకి విషయంలో బీజేపీ అన్యాయం చేసిందని భావిస్తున్న చంద్రబాబు ఎలాగైనా మోడీ సర్కార్ ను గద్దెదించాలని కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో బీజేపీ వ్యతిరేక ప్రచారం చేస్తున్న ఆయన.. ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా బీజేపీని ఎండగట్టాలనే స్కెచ్ తో ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఇలా జాతీయ నేతలతో వరస భేటీలు నిర్వహిస్తున్నారు.