Chandrababu Naidu: గత ప్రభుత్వంలో కీలక నాయకుడిగా ఉన్న కొడాలి నాని లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో కొడాలి నానిని ఓడించిన టీడీపీ మిత్రపక్ష కూటమి ఇప్పుడు అతడిని మరింతగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఇన్నాళ్లు కొడాలి నాని అడ్డాగా ఉన్న గుడివాడలో చంద్రబాబు పర్యటిస్తుండడం గమనార్హం. గుడివాడ నా అడ్డా అని చెలరేగిపోయిన కొడాలి నాని రాజకీయంగా సమాధి చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు చేపట్టిన గుడివాడ పర్యటన ఆసక్తికరంగా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Kadapa Airport: ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌.. ఎక్కడికైనా కడప నుంచి నిమిషాల్లో జర్నీ


గత ప్రభుత్వంలో మంత్రిగా కొడాలి నాని పని చేశారు. కొన్నేళ్లుగా గుడివాడలో ఏకచత్రాధిపత్యం చలాయిస్తున్న కొడాలి నానికి గత ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. గుడివాడలో ఘోర ఓటమిని చవిచూసిన నాని ఆ తర్వాత రాజకీయాలను వదిలేసినట్లు కనిపిస్తోంది. బయటకు కూడా రావడం లేదు. మంత్రిగా.. ఎమ్మెల్యేగా జగన్‌ పాలనలో రెచ్చిపోయిన కొడాలి నాని ఇప్పుడు సైలెంట్‌ అవడం అందరిలో చర్చ
జరుగుతోంది.

Also Read: Visakhapatnam MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీకి లైన్ క్లియర్.. పోటీ నుంచి టీడీపీ అవుట్..!


దెబ్బతీసిన చోటే..
ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చంద్రబాబు గుడివాడలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. జగన్‌ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను నిర్వీర్యం చేయగా.. వాటిని పునరుద్ధరించి పేదలకు రూ.5 టిఫిన్లు, భోజనం అందించేందుకు సిద్ధమైంది. సరికొత్తగా అన్న క్యాంటీన్లను ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఆ క్యాంటీన్‌లను గుడివాడ నుంచి చంద్రబాబు ప్రారంభించ నున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభమవుతాయి. తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ క్యాంటీన్లకు హరేకృష్ణ ఫౌండేషన్‌ ఆహార సరఫరా అందించనుంది.


కొడాలి నాని అరెస్ట్‌?
ఈ పర్యటనతో కొడాలి నానికి ఝలక్‌ ఇచ్చే యోచనలో టీడీపీ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక సైలెంట్‌ అయిన కొడాలి నాని వర్గానికి చంద్రబాబు పర్యటనతో ఒక హెచ్చరిక జారీ చేయాలని స్థానిక టీడీపీ భావిస్తోంది. చంద్రబాబు పర్యటనతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వర్గం గుడివాడలో పూర్తి విశ్వాసంతో పని చేయాలని భావిస్తోంది. నియోజకవర్గంలో తమకు తిరుగులేదని నిరూపించేందుకు.. తమ సత్తా చాటేందుకు వెనిగండ్ల రాము వర్గం కూడా సిద్ధమైంది. మొత్తానికి కొడాలి నానిని రాజకీయంగా నామరూపాలు లేకుండా చేసేందుకు ఈ పర్యటనను స్థానిక టీడీపీ వినియోగించుకోనుంది. ఇప్పటికే వల్లభనేని వంశీ అరెస్ట్‌ కాగా.. తర్వాత కొడాలి నాని అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గుడివాడ పర్యటన జరుగుతుండడం ఉత్కంఠ రేపుతోంది. చంద్రబాబు గుడివాడ పర్యటన అనంతరం కొడాలి నాని అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.


చంద్రబాబు గుడివాడ షెడ్యూల్‌
గుడివాడ పర్యటనకు చంద్రబాబు శుక్రవారం వెళ్లనున్నారు. ఉదయం 6.30 గంటలకు గుడివాడలో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తారు. పేదలకు ఉదయం పూట టిఫిన్‌ అందించి అన్న క్యాంటీన్‌లను అట్టహాసంగా ప్రారంభిస్తారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.