Chandrababu Naidu Speech At NTR Centenary Celebrations: ఒకవైపు పది కోట్ల మంది తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పిస్తే.. మరోవైపు ఒక నాయకుడు మరో నాయకుడిని ఎలా ప్రభావితం చేస్తారో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పారు అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నేటి యువత సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలి అని యువతకు సూచించారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి అని పేర్కొంటూ.. ఎన్టీఆర్ ఎక్కడ ఉంటే అక్కడ స్ఫూర్తి ఉంటుంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తెలుగు వారిలో ఒక స్ఫూర్తిని రగిలించారు. ఆ స్పూర్తి తెలుగుజాతిలో శాశ్వతంగా ఉండాలి అని అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రజినీకాంత్ గొప్పతనం గురించి చెబుతూ.. రజినీకాంత్ అభిమానులు భాషలతో సంబంధం లేకుండా ఆయన  చిత్రాలను ఆదరించారు అని గుర్తుచేసుకున్నారు. రజనీకాంత్‌కు జపాన్‌లో వీరాభిమానులు ఉన్నారు. మంచి మానవత్వం ఉన్న వ్యక్తి రజనీకాంత్. అందుకే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు రజనీకాంత్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. స్వర్గీయ నందమూరి తారక రామారావుపై ఉన్న అభిమానంతో ఆహ్వానించగానే కాదనకుండా తన సినిమా షూటింగ్ పనులు రద్దు చేసుకుని మరీ ఉత్సవాలకు వచ్చారు అని చంద్రబాబు తెలిపారు. 


ఎన్టీఆర్ నటించిన విధంగా భవిష్యత్తులో ఎవరూ చేయలేరు. ఆయనకు ఆయనే సాటి.. అలాంటి గొప్ప నటుడు, నాయకుడు ఇంకెవ్వరూ లేరు అని స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి చంద్రబాబు నాయుడు గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ సాధారణ వ్యక్తి కాదని.. తెలుగు జాతి ఉన్నంతవరకు ఆయన్ను శాశ్వతంగా గుర్తుంచుకునే వ్యక్తిత్వం కలిగిన గొప్ప మనిషి అని అన్నారు. ఎన్టీఆర్ ఆనాడు అధికారం దాహంతోనో లేక అధికారం కోసమో రాజకీయాల్లోకి రాలేదు. దేశ రాజకీయాల్లో మార్పు తేవాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుజాతి అవమానాలకు గురవుతోందని బాధపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. అందుకే తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయే వ్యక్తి ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ గురించి చంద్రబాబు కొనియాడారు. 


ఇది కూడా చదవండి : Revanth Reddy Nalgonda Meeting: ఇది నల్గొండ బిడ్డలకే అవమానం.. రేవంత్ రెడ్డి ఎమోషనల్ స్పీచ్


ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి. తెలుగు జాతి కోసం ఎంతో సేవ చేసిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేవరకు తెలుగుజాతి పోరాడాలి. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని పోరాడేందుకు తెలుగు వారు ప్రతీ ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసి ఢిల్లీకి పంపుతాం. సినీ, రాజకీయరంగాల్లో బాలకృష్ణ రాణిస్తున్నారు. ఆనాడు ఎన్టీఆర్ స్థాపించిన బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని సేవాభావంతో నడిపిస్తున్నారు. ఎన్టీఆర్ మెచ్చిన పాత్రికేయుడు వెంకటనారాయణ. ఎన్టీఆర్‌పై తొలినాళ్లలో వెంకటనారాయణ పుస్తకం రాశారు. ఎన్టీఆర్ గురించి దేశానికే కాదు.. ప్రపంచానికి తెలియజెప్పారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరును పర్యాటక కేంద్రంగా మారుస్తాం. ఎన్టీఆర్ పేరుతో మెమోరియల్ రూపొందేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. తెలుగు వారికి అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో చేసి చూపించిన పార్టీ టీడీపీ అని నారా చంద్రబాబు నాయుడు గుర్తుచేసుకున్నారు.


ఇది కూడా చదవండి : Rajinikanth About NTR: ఎన్టీఆర్ గురించి రజినీకాంత్ ఏమన్నారో తెలుసా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK