అమరావతి: ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన నేపథ్యంలో ఇవాళ సాయంత్రం కొద్దిసేపటి క్రితమే ఆయన గవర్నర్‌కి తన రాజీనామా లేఖను సమర్పించారు. రాజీనామా అనంతరం తొలిసారిగా మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని చెబుతూ ఏపీ ఎన్నికల్లో గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఒడిశాలో విజయం సొంతం చేసుకున్న నవీన్ పట్నాయక్‌కు, కేంద్రంలో బీజేపికి భారీ మెజార్టీ దక్కించుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేశారు.


ఓటమి గురించి మాట్లాడుతూ ఫలితాలపై త్వరలోనే సమీక్షించుకుంటామని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఎన్నికల్లో టీడీపికి సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు.