Chandrababu VS Jr NTR: బాబుకు ఎన్టీఆర్ ఫాన్స్ తలనొప్పి.. పక్కలో బల్లెంలా తయారయ్యరుగా?
Chandrababu VS Jr NTR Fans: విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు చంద్రబాబు కాన్వాయ్ తోనే ప్రయాణిస్తూ జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఫోటోలు ప్రదర్శించిన ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తోంది.
Chandrababu VS Jr NTR Fans at Krishna District: తెలుగుదేశం పార్టీకి టెన్షన్ కలిగించే విషయాలలో అధికార వైసీపీతో పాటు ఇప్పుడు కొత్తగా ఎన్టీఆర్ అభిమానులు కూడా చేరారు. జూనియర్ ఎన్టీఆర్కు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలంటూ చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు పర్యటనలో చంద్రబాబు ముందే ప్రస్తావిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక తాజాగా చంద్రబాబు మచిలీపట్నం పర్యటనలో సైతం జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సెగ తగలడం హాట్ టాపిక్ అయింది.
విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు చంద్రబాబు కాన్వాయ్ తోనే ప్రయాణిస్తూ జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఫోటోలు ప్రదర్శించిన ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ చంద్రబాబు కాన్వాయ్ ఎదుట నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాక ఎన్టీఆర్ చిత్రపటాలు పట్టుకొని అభిమానులు హల్చల్ చేస్తూ ఉండడంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అనే నినాదాలు పెద్ద ఎత్తున చేస్తూ తన కాన్వాయ్ ముందు నుంచి కుదరకపోవడంతో వారిని కాన్వాయ్ ముందు నుంచి పక్కకు తప్పించాలని తన పక్కనే ఉన్న టిడిపి నేతలు సూచించినట్లు తెలుస్తోంది.
అయితే వారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కాదని వారి ముసుగులో ఉన్న వైసీపీ కార్యకర్తలే ఇలా కావాలని చంద్రబాబు కాన్వాయ్ ముందు హల్చల్ చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే టీడీపీ నేతలు కావాలనే ఎన్టీఆర్ అభిమానులను పక్కకు లాగేసారని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటిని కూడా టిడిపి నేతలు చింపి వేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు టిడిపి శ్రేణులు మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుందనే ప్రచారం జరుగుతోంది.
పెనమలూరు, పోరంకి సెంటర్లు అదేవిధంగా మచిలీపట్నంలోని మూడు రోడ్ల కూడలిలో సైతం ఎన్టీఆర్ అభిమానులు ఇలా ఫోటోలతో సందడి చేశారని మచిలీపట్నంలో అయితే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పక్కకి లాగేసారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఫోటో పట్టుకున్న ఒక యువకుడు మీద కూడా టీడీపీ మీద దాడి చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం మీద టీడీపీ శ్రేణులు తమ వెర్షన్ వేరేగా వినిపిస్తున్నాయి. వైసిపి ఐపాక్ టీం కావాలనే అభిమానుల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఇలాంటి విషయాలను తెరమీదకి తీసుకొస్తున్నాయని, రకరకాల ప్రచారాలు చేస్తూ అనవసరమైన చర్చలకు దారి తీస్తున్నాయని చెబుతున్నారు.
ఇదీ చదవండి: Vetrimaran on Jr NTR: ఎన్టీఆర్ సినిమాపై వెట్రిమారన్ క్లారిటీ.. ఆ ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook