ఏపీ సీఎం చంద్రబాబు ఈసీపై చేస్తున్న పోరు మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమౌతున్నారు. ఎలక్షన్ కమిషన్ తీరును ఏపీలో ఎండగట్టిన చంద్రబాబు..ఢిల్లీ స్థాయిలో తన వాయిస్ ను వినించారు. ఈ క్రమంలో చెన్నై, కర్ణాటకలో పర్యటనలో ఇదే అంశం ప్రస్తావిస్తూ ఎలక్షన్ కమిషన్ పనితీరుపై తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు తాజా ఈవీఎంల అంశంపై దేశ వ్యాప్తంగా సదస్సులు నిర్వహించేందుకు సిద్ధమౌతున్నట్లు ప్రకటించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈవీఎంల పనితీరును జనాల్లో ఎండగట్టి మీడియాతో పాటు మేధావులు, విద్యార్థులను చైతన్య వంతం చేసి  ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తానంటున్నారు.


ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ అనురిస్తున్న ధోరణి అప్రజాస్వామ్యంగా ఉందని విమర్శించారు. ఇలాంటి అప్రజాస్వామిక ధోరణులను సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ఆయుధంలా వాడాలని ప్రజలకు సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న అన్యాయాలపై వాట్సాప్ వంటి సాధనాలతో తెలిసినవాళ్లకి ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించారు.