అమరావతి: తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవాలంటూ ప్రధాని మోడీకి  ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశాయి. తుపాను బీభత్సం కారణంగా శ్రీకాకుళం జిల్లా తో సహా ఏపీలోని కొన్ని ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.2 వేల 800 కోట్ల మేర నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రంగాల వారీగా జరిగిన నష్టాన్ని చంద్రబాబు తన లేఖలో వివరించారు. 
* వ్యవసాయ రంగానికి రూ.1800 కోట్లు
* పంచాయతీ రాజ్‌ శాఖకు మరో రూ.100 కోట్లు 
* రహదారులు, భవనాల శాఖకు రూ. 100 కోట్లు
* పశుసంవర్ధక, మత్స్యశాఖకు రూ.100 కోట్లు
* గ్రామీణ నీటిసరఫరా శాఖకు రూ.100 కోట్లు
*  జలవనరుల శాఖకు రూ.100 కోట్లు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటితో పాటు పలు రంగాలకు నష్టం వాటిల్లినట్లు చంద్రబాబు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను తీసుకుంటోందని ..కేంద్రం కూడా ముందుకు వచ్చి తన వంతు  సాయం అందించి బాధితులను ఆదుకోవాలని కోరారు. తక్షణ సాయం కింద రూ.1200 కోట్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. 


తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. తుపాను బీభత్సవం వల్ల లక్షల ఎకరాలు నీట మునగడం, ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు రాజకీయ పార్టీలు, స్వచ్చంధ సంస్థలు తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు.