వెనకబడిన తరగతుల వారికి ఆదుకునేందుకు ఏపీ సర్కార్ మరో కొత్త  పథకాన్ని తెరపైకి తెచ్చింది.  'చంద్రన్న పెళ్లి కానుక' పేరుతో రూపొందించిన ఈ పథకం ద్వారా పెళ్లి ఖర్చుల కోసం ఆడపిల్ల వారికి  రూ. 30 వేల ఆర్ధిక సాయం ప్రభుత్వం అందించనుంది. వెనకబడిన తరగతుల పేదవారికి కొత్త సంవత్సరం కానుకగా  ఈ పథకాన్ని ప్రకటించాలని  చంద్రబాబు భావిస్తున్నారు. దీని కోసం వచ్చే ఏడాది బడ్జెట్ లో రూ.300 కోట్ల కేటాయించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ, మైనార్టీలకు ఇలాంటి పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అర్హతలు:


* దారిద్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలై తెలుపు రేషన్ కార్డు ఉండాలి.


* వివాహం చేసుకునే వధువు వయస్సు 18 ఏళ్లు, వరుడి వయస్సు 21 ఏళ్లు పూర్తయి ఉండాలి


* మీసేవా కేంద్రాల్లో జారీ చేసిన కులుధ్రువీకరణ పత్రం తప్పనిసరి