హైదరాబాద్‌లో ఓ దొంగల ముఠా గత కొంతకాలంగా తిష్ట వేసుకొని కూర్చొంది. అచ్చం "దండుపాళ్యం" సినిమాలో చూపించినట్లుగానే ఈ గ్యాంగ్ అరాచకాలు చేస్తుందట. ఈ మధ్యకాలంలో వీరి అరాచకాలు మరీ శ్రుతి మించిపోతున్నాయి. చెడ్డి-బనియన్ గ్యాంగ్ పేరుతో ఈ ముఠాను పిలుస్తున్నారు పోలీసులు. సైబరాబాద్ పోలీసులు ఇటీవలే ఈ గ్యాంగ్‌కు సంబంధించిన సీసీటీవి ఫుటేజీని విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిటీకి దూరంగా ఉండే ఖరీదైన ఇళ్ళను టార్గెట్ చేసి.. రాత్రిళ్లు అందులో జొరబడి.. ఎదురుతిరిగే వ్యక్తులను కిరాతకంగా పొడిచి.. ఇళ్లంతా దోచుకుపోవడం ఈ గ్యాంగ్ చేసే పనుల్లో ఒకటి. అలాగే రాత్రిళ్లు ఒళ్ళంతా చమురు పూసుకొని తిరిగే ఈ గ్యాంగ్, ఎవరైనా పట్టుకుంటే జారిపోవడం కోసమే ఆ పథకాన్ని ఎంచుకొన్నట్లు తెలుస్తోంది.


కేవలం బనియన్లు, చడ్డీలు ధరించి దొంగతనానికి వచ్చే ఈ గ్యాంగ్‌ పట్ల అప్రమత్తతతో ఉండాలని ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు ప్రకటన జారీ చేశారు.  చెడ్డీ బనియన్ డ్రస్ కోడ్‌తో ఎవరైనా ఆగంతకులు కనిపిస్తే.. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాల్సిందిగా సైబరాబాద్ డీసీపీ విశ్వప్రసాద్ తెలియజేశారు. ఆంధ్ర, తెలంగాణా, కర్ణాటక ప్రాంతాల్లో ఇప్పటికే ఈ గ్యాంగ్ అనేక దొంగతనాలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.