Cheetah in Mahanandi:మహానందిలో చిరుత కలకలం ..వీడియో వైరల్..
Cheetah in Mahanandi: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అడవులకు సమీపంలో ఉండే గ్రామాల్లో చిరుత, పెద్ద పులి సంచారం కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ పరిసర జిల్లాల్లో పెద్ద పులి సంచారం సంచలనం రేపింది. తాజాగా ఏపీలోని నంద్యాల చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది.
Cheetah in Mahanandi: ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) నంద్యాల జిల్లా మహానంది మండలం ఎంసీ ఫారం గ్రామ సమీపంలో చిరుత పులి సంచారం పెద్ద కలకలం రేపింది. మహానందికి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకొని బస్సులో వెళ్తుండగా మార్గం మధ్యలో చిరుత పులి కనిపించింది.
దీంతో బస్సులో ఉన్న భక్తులు కొంత మంది పులి సంచారాన్ని చిత్రీకరించారు. అంతేకదు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దానికి సబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ఈ సందర్భంగా మహానందిలో చిరుత పులి రోడ్డు దాటుతూ పొలంలోకి వెళ్లింది.
చిరుత పులి సంచారంతో స్థానిక గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పులిని ఇక్కడి నుండి తరలించాలని అటవీశాఖ అధికారులు కోరుతున్నారు గ్రామస్తులు. అయితే.. కర్నూలు, నంద్యాల, ప్రకాశం, నాగర్ కర్నూలు సహా తిరుపతి వరకు నల్లమల అటవీ ప్రాంతంతో పాటు శేషాచలం అడవులు విస్తరించి ఉన్నాయి. అంతేకాదు మన దేశంలోనే అతిపెద్దదైన టైగర్ రిజర్వ్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉంది. ఈ నేపథ్యంలో సమీపంలోని అడవిలో తిరిగే చిరుత ఇక్కడ దారి తప్పి ఇక్కడికి వచ్చిందని చెబుతున్నారు. తెలంగాణలో పెద్దపులి.. ఓ మహిళను దాడి చేసి చంపిన దుర్ఘటన ప్రజల కళ్ల ముందు కదులుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మహానందిలో చిరుత సంచారం అక్కడ ప్రజల్లో భయాందోళనలు నెలకొనేలా చేసాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు చిరుత పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.
ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..
ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.