Andhra Pradesh Chief Whips: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసి కొత్త శాసన సభ కొలువుదీరడంతో పదవుల ప్రక్రియ పెండింగ్‌లో ఉండగా తాజాగా కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రధాన విప్‌, విప్‌ల వంటి పదవులను భర్తీ చేసింది. ఈ పదవుల్లో కూటమిలోని తెలుగుదేశం పార్టీతోపాటు జనసేన పార్టీ, బీజేపీలకు కూడా సమ ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ఏపీ అసెంబ్లీలో చీఫ్ విప్‍గా జీవీ ఆంజనేయులు నియామకం కాగా.. శాసనమండలిలో చీఫ్ విప్‍గా పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Sharmila: విషనాగుల వెనుక ఉన్న అనకొండ వైఎస్‌ జగన్‌ను అరెస్ట్‌ చేయాలి


ఏపీ అసెంబ్లీలో  విప్‍లుగా 15 మందిని ఏపీ ప్రభుత్వం నియమించింది. తెలుగుదేశం పార్టీకి 12 విప్‌లు.. జనసేన పార్టీ 3 విప్‌లు.. భారతీయ జనతా పార్టీ ఒక విప్‌ పదవి దక్కింది. సామాజికవారీగా లెక్కలు వేసుకుని.. జిల్లాలకు కూడా ప్రాధాన్యం ఇస్తూ ఈ పదవులను సీఎం చంద్రబాబు భర్తీ చేపట్టారు. అసంతృప్తి జ్వాలలు రాకుండా జాగ్రత్త పడ్డారు. కాగా ఈ పదవుల్లో కడప జిల్లాకు విశేష ప్రాధాన్యం దక్కింది. కూటమి తరఫున ఉమ్మడి కడప జిల్లా నుంచి ముగ్గురు మూడు పార్టీల నుంచి నియమితులయ్యారు. కడప జిల్లా నుంచి ఆదినారాయణ రెడ్డి (బీజేపీ), అరవ శ్రీధర్‌ (జనసేన), మాధవి (టీడీపీ) విప్‌లుగా ఎంపికయ్యారు.


Also Read: YS Sharmila: దీపం పథకంలో సగం మంది మహిళలకు కోత పెడతారా? బడ్జెట్‌పై షర్మిల విమర్శలు


 


విప్‍లు
తెలుగుదేశం పార్టీ:
బెందాళం అశోక్, యనమల దివ్య, బోండా ఉమ, దాట్ల సుబ్బరాజు, డా.థామస్, జగదీశ్వరి, కాల్వ శ్రీనివాసులు, మాధవి రెడ్డప్ప (కడప), గణబాబు, పీజీవీఆర్‌ నాయుడు, తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకట్రావు
జనసేన పార్టీ: బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్ (రైల్వే కోడూరు ఎమ్మెల్యే)
బీజేపీ: ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు ఎమ్మెల్యే)


కాల్వ శ్రీనివాసులకు షాక్‌
ఈ పదవుల్లో సీనియర్‌ ఎమ్మెల్యే.. టీడీపీ నమ్మినబంటుగా ఉన్న కాల్వ శ్రీనివాసుకు అన్యాయం జరిగినట్లు చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని అందరూ ఊహించారు. కానీ నిరాశే ఎదురైంది. నామినేటెడ్‌ పోస్టుల్లో కూడా అవకాశం లభించకపోవడంతో అసెంబ్లీలో ప్రధాన విప్‌ పదవి లభిస్తుందని చర్చ జరగ్గా అది కూడా నెరవేరలేదు. సీనియర్‌ సభ్యుడైన కాల్వకు విప్‌ పదవి ఇవ్వడంతో ఆయన వర్గం అసంతృప్తికి గురయినట్లు తెలుస్తోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి