చింతమనేని ప్రభాకర్‌పై మరో 4 కేసులు
చింతమనేని ప్రభాకర్‌పై మరో 4 కేసులు
ఏలూరు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే గతంలో నమోదైన కేసుల్లో రిమాండ్‌లో ఉన్న చింతమనేని ప్రభాకర్‌పై తాజాగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. దెందులూరు, పెదవేగి, పెదపాడు పోలీసు స్టేషన్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఈ కేసులు నమోదయ్యాయి. పీటీ వారెంట్‌పై చింతమనేనిని పోలీసులు ఏలూరు జిల్లా జైలు నుంచి తీసుకొచ్చి జిల్లా కోర్టులో హాజరుపరిచగా కోర్టు ఆయనకు నవంబర్ 20వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
చింతమనేనిని పీటీ వారెంట్‌పై కోర్టులో హాజరుపర్చడం ఇదేం మొదటిసారి కాదు. పెదవేగిలో మాజీ సర్పంచ్ మేడికొండ కృష్ణారావును కిడ్పాప్ చేసి ఆయనపై దాడికి పాల్పడ్డారనే కేసులోనూ చింతమనేనిని గత నెల 7వ తేదీన పోలీసులు ఆయనను కోర్టు ఎదుట హాజరుపరిచారు.