మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు మచిలీపట్నం నియోజకవర్గానికి ఎంపీ ల్యాడ్స్ ద్వారా రూ.5 కోట్ల రూపాయలను కేటాయించారు. ఆ ఫండ్స్ ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని.. అందుకు గాను చిరంజీవికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కొల్లు రవీంద్ర. ఈ సందర్భంగా ఆయన చిరంజీవిని ప్రత్యేకంగా కలిసి ముచ్చటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిరంజీవి కూడా ఈ విషయంపై సంతోషాన్ని కనబరిచి హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి  పనులకు సంబంధించిన రిపోర్టులను కూడా రవీంద్ర చిరంజీవికి చూపించారు. తను కేటాయించిన నిధుల వల్ల ప్రజలకు మేలు జరిగినందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా చిరంజీవి మీడియాకి తెలిపారు. 


చిరంజీవి రాజ్యసభ ఎంపీ సభ్యత్వం 2 ఏప్రిల్ 2018 తేదిన ముగిసింది. అంతకు ముందే ఆయన ఎంపీ ల్యాడ్స్ నిధులను పలు గ్రామాలకు కేటాయించారు. అందులో మచిలీపట్నం ఒకటి. చిరంజీవి గతంలో కాంగ్రెస్ హయాంలో టూరిజం శాఖ మంత్రిగా వ్యవహరించారు. అంతకు ముందే ఆయన అదే పార్టీలో తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన సంగతి మనకు తెలిసిందే.