Midnight High Drama in Chittoor: చిత్తూరు జిల్లాలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. మాజీ మేయర్, నగర టీడీపీ అధ్యక్షురాలు  కఠారి హేమలత అనుచరుడు పూర్ణ ఇంట్లో గంజాయి ఉందనే సమాచారంతో పోలీసులు తనిఖీలకు వెళ్లారు. ఆ సమయంలో హేమలత అక్కడికి చేరుకుని పోలీసులను అడ్డగించారు. పోలీస్ జీపును కదలనివ్వకుండా అనుచరులతో కలిసి బైఠాయించారు. హేమలత, ఆమె అనుచరులు అక్కడి నుంచి కదలకపోవడంతో పోలీసులు వారి పైనుంచే జీపును ఎక్కించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో గాయపడిన హేమలతను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హేమలత రెండు కాళ్లు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసులపై హేమలత అనుచరుల ఆరోపణలు :


చిత్తూరులోని సంతపేటలో ఉన్న హేమలత అనుచరుడు పూర్ణ ఇంటికి గురువారం (జూన్ 23) రాత్రి 11 గం. సమయంలో పోలీసులు వచ్చారు. ఇంట్లో గంజాయి ఉన్నట్లు సమాచారం అందడంతో సోదాలు చేసేందుకు వచ్చామని తెలిపారు. తమ ఇంట్లో గంజాయి లేదని.. ఎవరో తప్పుడు సమాచారమిచ్చారని పూర్ణ పోలీసులతో చెప్పారు. ఇంతలో హేమలత కూడా అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో సోదాలు చేయకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులే పూర్ణ ఇంట్లో గంజాయి బస్తాలు పెట్టేందుకు ప్రయత్నించారని హేమలత అనుచరులు ఆరోపిస్తున్నారు. అక్రమ కేసుల్లో ఇరికించేందుకే ఈ ప్లాన్ చేశారని ఆరోపిస్తున్నారు. 


పోలీసులు తీసుకొచ్చిన బస్తాల్లో ఏముందో చూపమని అడిగినందుకు పూర్ణను పోలీస్ జీపులో ఎక్కించారన్నారు. జీపు అక్కడి నుంచి కదలకుండా హేమలత, ఆమె అనుచరులు అక్కడ బైఠాయించారని చెప్పారు. పోలీసులు జీపును రివర్స్ చేసే క్రమంలో హేమలతపై జీపు ఎక్కించడంతో ఆమె గాయపడినట్లు చెప్పారు. దివంగత మేయర్ కఠారి అనురాధ, మోహన్‌ల హత్య కేసును నీరుగార్చే కుట్రలో భాగంగానే పోలీసులు ఇలా గంజాయి కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.


మరోవైపు, పోలీసులు మాత్రం తమపై చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. పూర్ణ ఇంట్లో గంజాయి లభించిందని చెప్పారు. టీడీపీ నేతలు జీపుకు అడ్డుగా బైఠాయించారని... వాహనం వారి పైనుంచి వెళ్లకపోయినా వెళ్లిందని ఆరోపిస్తున్నట్లు చెప్పారు.



Also Read: Revanth Reddy: చంచల్ గూడ జైలుకు రేవంత్ రెడ్డి


Also Read: Horoscope Today June 24th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఇవాళ ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు..  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.