Chittoor Lance Naik Sai Teja's Body reaches Yelahanka Air Force Base in Bengaluru IAF military officials pay tribute: తమిళనాడు కూనూర్‌ సమీపంలో డిసెంబర్‌ 8న చోటుచేసుకున్న హెలికాప్టర్‌ ప్రమాదంలో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో రావత్‌తో పాటు ఆయన భార్య మరో 11 మంది కూడా మరణించారు. మరణించిన వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్‌ నాయక్ సాయితేజ (Lance Naik Sai Teja) కూడా ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాన్స్‌ నాయక్ సాయితేజ భౌతికకాయాన్ని (Dead Body) డీఎన్‌ఏ టెస్ట్ ద్వారా గుర్తించారు. ఢిల్లీ నుంచి కోయంబత్తూరుకు ప్రత్యేక ఫ్లైట్‌లో సాయి తేజ (Lance Naik Sai Teja) భౌతికకాయాన్ని అధికారులు తరలించారు. కోయంబత్తూరు మీదుగా బెంగళూరుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం లాన్స్ నాయక్ బి సాయి తేజ భౌతికకాయం బెంగళూరులోని యెలహంక ఎయిర్ ఫోర్స్ బేస్‌కు చేరుకుంది. IAF సైనిక అధికారులు నివాళులర్పించారు. తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా ఎగువ రేగడ (Eguvaregada) గ్రామానికి సాయితేజ భౌతికకాయాన్ని తీసుకెళ్తారు.



 


రేపు సాయి తేజ స్వగ్రామమైన ఎగువ రేగడకు (Eguvaregada) భౌతికకాయం చేరుకుంటుంది. సైనిక లాంఛనాలతో రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక ఇప్పటికే సాయితేజ కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థికసాయం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. రేపు ఏపీ ప్రభుత్వం తరుఫున ప్రముఖ నేతలు సాయితేజ అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం ఉంది.


Also Read : Saiteja: సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం


అయితే ఇవాళ రాత్రి బెంగళూరులోని సైనిక హాస్పిటల్‌లోనే సాయితేజ భౌతికకాయాన్ని ఉంచి రేపు ఉదయం తమకు అప్పగించాలని సాయి తేజ కుటుంబ సభ్యులు కోరారు. దీంతో రేపు ఎగువ రేగడకు సాయితేజ (Sai Teja) భౌతికకాయాన్ని తరలించనున్నారు.


Also Read : RRR: చెర్రీ, ఎన్టీఆర్‌లతో చాలా ప్రాబ్లమ్స్.. జక్కన్న కంప్లైంట్‌కి ఊహించని ఝలక్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook