CID CASE ON ABN MD Radhakrishna: సీఐడీ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఆంధ్రజ్యోతి)Andhra Jyothi), ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ(Vemuri Radhakrishna)పై కేసు నమోదైంది. ఇటీవల హైదరాబాద్‌లో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు చేస్తున్నప్పుడు రాధాకృష్ణ, మరికొందరు అక్కడికి చేరుకుని తమ విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐడీ(AP CID) విభాగం పేర్కొంది. రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న జీవీవీ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై మంగళగిరిలోని సీఐడీ ప్రధాన పోలీసుస్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌(Zero FIR) నమోదు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: AP Omicron Update: ఏపీలో తొలి ఒమిక్రాన్ వ్యక్తికి కోవిడ్ నెగెటివ్, ఇప్పుడు రాష్ట్రంలో జీరో కేసులు


న్యాయవాది జీవీజీ నాయుడు, ఏబీఎన్‌ వీడియోగ్రాఫర్‌ ఎన్‌.రమేష్‌, ఏబీఎన్‌ రిపోర్టింగ్‌ ఏజెంట్‌ సోమపల్లి చక్రవర్తి రాజును నిందితులుగా పేర్కొన్నారు.  ఈ జీరో ఎఫ్ఐఆర్​ను గుంటూరులోని ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి న్యాయస్థానంలో సమర్పించామని, తదుపరి విచారణకు జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌ ఎస్​హెచ్​ఓకు ఈ కేసును బదలాయించేందుకు వీలుగా తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించామని ఎఫ్ఐఆర్ లో తెలిపారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook