Janasena Politics: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్‌ కోలువుదీరాక.. ఒకే ఒక్క మంత్రి పదవిని భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచారు. ఆ పదవి కోసం చాలామంది లీడర్లు పోటీ పడ్డప్పటికీ పదవిని మాత్రం భర్తీ చేయలేదు. తాజాగా ఈ పోస్టును సీఎం చంద్రబాబు భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. మెగా బ్రదర్‌ నాగబాబును కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లోనే నాగబాబు చేత ప్రమాణం స్వీకారం చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే నాగబాబుకు ఇప్పుడు ఏ శాఖ కట్టబెట్టబోతున్నారు అనేది మాత్రం ఆసక్తి కరంగా మారింది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెగా బ్రదర్‌ నాగబాబు జనసేన పార్టీలో కీలకంగా ఉన్నారు. ఆయనకు గత పార్లమెంటు ఎన్నికల సమయంలోనే అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అనకాపల్లి సీటును సీఎం రమేష్‌కు కేటాయించడంతో నాగబాబు సైలెంట్‌ అయ్యారు. ఆ తర్వాత నాగబాబుకు నామినేటేడ్‌ పోస్టు ఇస్తారని టాక్ వినిపించింది. తాజాగా రాజ్యసభ రేసులోనూ నాగబాబు ఉన్నారని చెప్పారు. కానీ రాజ్యసభకు టీడీపీ తరపున ఇద్దరు, బీజేపీ తరఫున ఇద్దరు వెళ్లడంతో.. జనసేన పరిస్థితి ఏంటనే చర్చ జరిగింది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు..


ముఖ్యంగా నాగబాబుకు మంత్రి పదవి రావడం వెనుక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ది కీలకపాత్రగా చెబుతున్నారు. పవన్‌ను రాష్ట్ర రాజకీయాల్లో కీలకం చేసి పవన్‌ కల్యాణ్‌ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలనే యోచననలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అందుకు తన సోదరుడికి పట్టుబట్టిమరి మంత్రి పదవి ఇప్పించుకున్నారని జనసేన వర్గాలు అంటున్నాయి. అయితే రాష్ట్ర కేబినెట్‌లో కీలకంగా వ్యవహరించాలంటే కీలకశాఖనే అప్పగిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం కేబినెట్‌లో మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్‌ దగ్గర రెండు శాఖలు ఉన్నాయి.. పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖలు ఆయన నిర్వహిస్తున్నారు. ఇందులో నుంచి నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖను ఇస్తారని ప్రచారం జరుగుతోంది. నాగబాబుకు సినిమా నేపథ్యం ఉండటంతో..ఆ శాఖ అప్పగిస్తే.. మంచి ప్రయోజనం ఉంటుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.


మొత్తంగా నాగబాబుకు ప్రమాణ స్వీకరానికి సంబంధించి రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. వీలైనంతా త్వరగా ప్రమాణ స్వీకారోత్సవంపై రాజ్‌భవన్‌ వర్గాలు నాగబాబుకు సమాచారం ఇచ్చే చాన్స్ ఉందట. అయితే ఈనెల 13వ తేదీన సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్‌ను ప్రకటించబోతున్నారు. కాబట్టి ఆ రోజున ఉండకపోవచ్చని అంటున్నారు. ఆ తర్వాత మంచిరోజు చేసి ప్రమాణ స్వీకారోత్సవానికి పిలుస్తారని టాక్‌ వినిపిస్తోంది.


Also Read:  Congress Politics: కేబినెట్‌ విస్తరణకు బ్రేక్‌.. అడ్డుపడిన నల్గొండ లీడర్‌


Also Read: AP Liquor Sales: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు.. సీసాలు సీసాలు తాగేశారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.