రాజధాని 'అమరావతి' ని ప్రపంచలోనే గొప్ప నందనవనం నగరంగా, నీటి వనరుల అనుసంధానమైన నగరంగా తీర్చిదిద్ధేందుకు రంగం సిద్ధమైంది. మూడేళ్ల కాలవ్యవధిలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుకు శంకుస్థాపన మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అమరావతిలో పచ్చదనం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం-మందడం మధ్య సీడ్‌యాక్సెస్‌ రహదారిలో మొక్కలు నాటి సీఎం పచ్చదనం ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.


రాజధాని నగరాన్ని నందనవనంగా మార్చే ప్రాజెక్టును అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడిసి) తీసుకుంది. పచ్చదనం ప్రాజెక్టుకు సుమారు రూ.1484 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టుకు 70% రుణ సదుపాయం కోసం ప్రపంచబ్యాంకును సంప్రదించాలని ఏడిసి భావిస్తోంది. అమరావతిని ప్రపంచలోనే అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.