Wine Shop Lottery: కొత్త మద్యం విధానంలో దుకాణాలు దక్కించుకున్న వారిని అపహరించడం.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర రచ్చ జరుగుతోంది. లాటరీ పొందిన వారిని నయానో.. భయానో బెదిరింపులకు పాల్పడి వారి దుకాణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాలు తన దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారుల నుంచి నివేదికలు సమర్పించాలని కోరారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ED Attaches: నైపుణ్యాభివృద్ధి కుంభకోణంలో చంద్రబాబుకు గట్టి షాకిచ్చిన ప్రధాని మోదీ


 


లాటరీలో మద్యం షాపులు దక్కించుకున్న వారిని బెదిరించారనే వార్తలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏయే ప్రాంతాల్లో బెదిరింపులకు పాల్పడ్డారనే విషయంపై సీఎం చంద్రబాబు సమాచారం తెప్పించుకుంటున్నారు. ప్రభుత్వ వర్గాలు, సామాజిక మాధ్యమాలు, టీడీపీ యంత్రాంగం, ఇంటెలిజెన్స్, ఆబ్కారీ శాఖ ద్వారా సమాచారం సేకరిస్తున్నారు.

Also Read: Ticket Price: సినిమా టికెట్‌ ధరలపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ సంచలన ప్రకటన


 


మద్యం దుకాణాల్లో వాటాల కోసం ఇబ్బందులు సృష్టిస్తే సహించేది లేదని నాయకులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే పలువురు నాయకులకు అధిష్టానం హెచ్చరించినట్లు సమాచారం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడాలని ఆదేశించారు. చెడ్డపేరు తెస్తే అంగీకరించేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దుకాణాలు పొందినవారు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.


కాగా మద్యం దుకాణాల కేటాయింపుపై తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మధ్య ఆరోపణలు, విమర్శలు మొదలయ్యాయి. ఇప్పటికే మద్యం టెండర్‌లలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు దక్కాయని ఆరోపణలు వస్తున్నాయి. మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సంచలన ఆరోపణలు చేశారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు తమ పార్టీ నాయకులు సంపద సృష్టించుకునేలా చేస్తున్నారని ఆరోపించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter