MP Raghurama Raju: నర్సాపురం ఎంపీ రఘురామ రాజు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయనో సంచలనం. 2019 ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా వైసీపీ నుంచి గెలిచిన రఘురామ కృష్ణం రాజు.. కొంత కాలానికే ఆ పార్టీతో విభేదించారు. సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ గత రెండున్నర ఏళ్లుగా రాజకీయం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై రఘురామ ఘాటైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఢిల్లీ లేదా హైదరాబాద్ లో ఉంటున్న రఘురామ తన పోరాటం కొనసాగిస్తున్నారు. రోజూ ఏదో ఒక అంశంపై ప్రెస్ మీట్ పెడుతూ.. జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. దీంతో రఘురామను వైసీపీ సర్కార్ టార్గెట్ చేస్తోంది. పలు కేసులు పెట్టింది. ఈ కేసులో రఘురామను ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలోనే తనను పోలీసులు కొట్టారంటూ రఘురామ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. సుప్రీంకోర్టులో బెయిల్ తో బయటికి వచ్చారు ఎంపీ రఘురామరాజు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనను అరెస్ట్ చేసిన తర్వాత మరింత దూకుడు పెంచిన ఎంపీ రఘురామ రాజు ఢిల్లీ వేదికగానే జగన్ సర్కార్ పై యుద్దం కొనసాగిస్తున్నారు. గత రెండున్నర ఏళ్లుగా ఏపీలో అడుగుపెట్టలేదు. తన సొంత నియోజకవర్గం నర్సాపురం కూడా వెళ్లలేదు. ఏపీలో అడుగుపెడితే పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతోనే రఘురామ ఢిల్లీ నుంచి రావడం లేదు. ఈ విషయాన్ని ఎంపీ రఘురామే ఓపెన్ గా చెప్పారు. అయితే రెండున్నర ఏళ్ల తర్వాత రఘురామ సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టబోతున్నారు. వెళ్లడమే కాదు సీఎం జగన్ తో కలిసి వేదిక పంచుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం భీమవరంలో పర్యటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న సభలో సీఎం జగన్ తో పాటు స్థానిక ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా పాల్గొంటున్నారు. ఇదే ఇప్పుడు ఏపీలో ఆసక్తిగా మారింది. సీఎం జగన్, ఎంపీ రఘురామ రాజు ఒకే వేదిక పంచుకోనుండటంతో ఏం జరుగుతుందన్న చర్చ సాగుతోంది.  


ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం సభకు ఎంపీ రఘురామ హాజరవుతారా లేదా అన్న అనుమానాలు వచ్చాయి. రఘురామ భీమవరం రాకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారనే చర్చ కూడా సాగింది.
భీమవరం వెళితే పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించిన ఎంపీ రఘురామ.. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. జూలై 3,4 తేదీలలో నర్సాపురంలో పర్యటించనున్నట్లు కోర్టుకు తెలిపారు. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ  పిటిషన్ దాఖలు చేశారు. భీమవరం వెళితే తనను అరెస్టు చేస్తారేమోన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. గతంలోనూ అలాగే జరిగిందని కోర్టుకు తెలిపారు. రఘురామ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆయనకు రక్షణ కల్పించాలని జగన్ సర్కార్ ను ఆదేశించింది. గతంలో నమోదైన కేసులకు సంబంధించి ఆయన నర్సాపురంలో పర్యటించే సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని తెలిపింది. కొత్తగా ఏవైనా కేసులు నమోదు చేస్తే వాటి విషయంలో కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలే తప్ప వెంటనే అరెస్టు చేయడానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది, హైకోర్టూ తీర్పుతో వైసీపీ రెబల్ ఎంపీ భీమవరం పర్యటన ఖరారైంది. స్థానిక ఎంపీగా ప్రొటోకాల్ ప్రకారం ప్రధానితో వేదిక పంచుకుంటారు రఘురామరాజు.


ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో సీఎం జగన్ పాల్గొంటారా లేదా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. మాస్టర్డ్ డిగ్రీ పూర్తి చేసిన తన కూతురు స్వాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పారిస్ వెళ్లారు సీఎం జగన్. అక్కడే జూలై 4 వరకు ఉంటారనే వార్తలు వచ్చాయి. అయితే పారిస్ నుంచి సీఎం జగన్ అమరావతికి తిరిగొచ్చారు. ఆదివారం ఉదయమే గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండయ్యారు. ప్రధాని మోడీ భీమవరం పర్యటనలో పాల్గొనేందుకే జగన్ త్వరగా వచ్చారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. జగన్ రాకతో ప్రధాని పర్యటనలో ఆయన పాల్గొనడం ఖాయమే. దీంతో సోమవారం భీమవరంలో జరగనున్న అల్లూరి జయంతి వేడుకల్లో సీఎం జగన్, ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఒకే వేదిక పంచుకోబోతున్నారు. సీఎం జగన్ తో రఘురామ మాట్లాడుతారా లేదా... రఘురామ విష్ చేస్తే జగన్ రియాక్షన్ ఎలా ఉంటుంది అన్న చర్చలు ఏపీలో జోరుగా సాగుతున్నాయి.


Read also: BJP MEETING: 10 లక్షల మందితో బీజేపీ బహిరంగ సభ.. ప్రధాని మోడీ ప్రసంగంపైనే ఉత్కంఠ!  




స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి



Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES