CM Jagan On AP Elections: APలో ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. గేర్ మార్చి స్పీడ్ పెంచాలని ఆదేశం
CM Jagan On AP Elections: ఏపీలో ఎన్నికలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా నిర్వహించాలని ఆదేశించారు. తాను ఏ ఒక్క ఎమ్మెల్యేను కూడా దూరం చేసుకోవాలని అనుకోవట్లేదన్నారు.
CM Jagan On AP Elections: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ నుంచి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ప్రారంభంకానున్న నేపథ్యంలో క్యాంపెయిన్‌పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయకర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారికి కీలక సూచనలు చేశారు.
ఫిబ్రవరి 13న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై రివ్యూ చేశామని.. ఆ తరువాత ఈ కార్యక్రమానికి హైప్ వచ్చిందన్నారు ముఖ్యమంత్రి. మళ్లీ గడపగడపకూ కార్యక్రమానికి ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. గేర్ మార్చి రెట్టించిన స్పీడ్‌తో కార్యక్రమం చేయాలని ఆదేశాంచారు. పేదవాళ్లు ఎవరూ మిస్‌కాకుండా వెరిఫికేషన్ చేసిన మరీ.. వారికి పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని ఏదో మాటలు చెబుతున్నారని.. 21 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తే.. 17 స్థానాల్లో మనం గెలిచామన్నారు.
'కొన్ని వాస్తవాలు అందరికీ తెలియాలి. ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఉంటారు. అంటే ఎమ్మెల్సీ స్థానం పరిధి.. దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి ఉంటుంది. ఆ 80 లక్షల మందిలో కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదుచేసుకున్నారు. వీళ్లంతా రకరకాల యూనియన్లకు చెందినవారు. మన ఎవరికైతే మంచి చేశామో.. వారు ఎమ్మెల్సీ ఓటర్లలో చాలా తక్కువ.
మిగిలిన పార్టీలు అందరూ కలిశారు.. మనం ఒక్కరిమే.. అయినా టీడీపీ మొదటి ప్రాధాన్యతతో గెలిచింది లేదు. రెండో ప్రాధాన్యత ఓటు వారికి ఉంది కాబట్టి గెలిచారు. అయినా కూడా ఒక వాపును చూపించి.. అది బలం అని చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా రూమర్లు ప్రచారం చేస్తారు. 60 మందికి టిక్కెట్లు ఇవ్వని లిస్టు కూడా తయారు చేస్తున్నారని చెప్తారు. ఇదే పనిగా పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇంతకంటే.. దుర్మార్గమైన ఎమ్మెల్యేలు ఉండరని కూడా ప్రచారం చేస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి మరీ విష ప్రచారంచేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి..' అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
మరో సంవత్సరంలో మనం ఎన్నికలకు వెళ్తున్నామన్నామని.. కేడర్ అత్యంత క్రియాశీలకంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సోషల్ మీడియాను బాగా వినియోగించుకోవాలని చెప్పారు.
సోషల్ మీడియాలో క్యాంపెయిన్‌ను ఉద్ధృతం చేసుకోవాలన్నారు. వాలంటీర్లను, గృహసారథులను మమేకం చేయాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ మన ప్రభుత్వంచేస్తున్నమంచిని ప్రతికుటుంబానికీ తీసుకెళ్లాలని సూచించారు. తాను ఏ ఒక్క ఎమ్మెల్యేను, కార్యకర్తను పోగొట్టుకోవాలని తాను అనుకోవడం లేదన్నారు. ఎన్నికలు సంవత్సరంలో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలని అందరికీ గట్టిగా చెప్పారు. అయితే ముందుస్తు ఎన్నికలు లేవని స్పష్టం చేశారు.
Also Read: IPL Points Table: టాప్‌లేపిన రాజస్థాన్.. హైదరాబాద్ పరిస్థితి దారుణం.. మిగిలిన జట్లు ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి