AP Assembly Elections 2024: ఏపీలో ఇంకా ఎన్నికల నోటిఫికేషన్‌ కాదు కదా.. షెడ్యూల్‌ కూడా రాకముందే రాజకీయాలు ఫుల్ హీటెక్కాయి. ఆ పార్టీలో నేతలు ఈ పార్టీలోకి.. ఈ పార్టీ నాయకులు ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఎప్పుడో గ్రౌండ్ వర్క్‌ మొదలుపెట్టేశారు. ఆరు నెలల ముందే ప్రణాళికలు అమలు చేయడం ప్రారంభించారు. వరుసగా నియోజకవర్గాల వారీగా పార్టీ ఇంఛార్జ్‌లను ప్రకటిస్తూ.. టికెట్లు ఇస్తున్నారు. ఇప్పటివరకు ప్రకటించిన మూడు జాబితాలతో అసంతృప్తి రాజ్యమేలుతోన్నట్లు తెలుస్తోంది. తమకు సీటు దక్కదని కన్ఫామ్‌ అయిన నేతలు పక్క పార్టీల వైపు దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీకి గుడ్‌బై చెప్పేసి తమ భవిష్యత్ చూసుకుంటున్నారు.
 
సీఎం జగన్ పక్కా ప్లాన్‌ ప్రకారమే అభ్యర్థులను మారుస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు సిట్టింగ్‌ల నియోజకవర్గాలను మారుస్తూ.. మరికొందరిని ఎంపీలుగా పోటీ చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే టికెట్ దక్కని నేతలు ఇండైరెక్ట్‌గా విమర్శలు చేస్తున్నారు. తమ అనుచరగణంతో చర్చించి.. పక్క పార్టీలలో టికెట్ కన్ఫార్మ్ అయితే జంప్ కొట్టేందుకు రెడీగా ఉన్నారు. ఎవరు పార్టీ నుంచి వెళ్లిపోయినా.. సీఎం జగన్ మాత్రం తాను వేసుకున్న ప్లాన్‌ను పక్కాగా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందుగానే ఎమ్మెల్యేలను పార్టీ కార్యాలయానికి పిలుపించుకుని మాట్లాడుతున్నారు. ఎందుకు టికెట్లు ఇవ్వలేకుపోతున్నామో కారణాలు చెబుతున్నారు. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే.. కీలక పదవులు అప్పగిస్తామని భరోసా ఇస్తున్నారు. పదవి ఇస్తామని గ్యారంటీ ఇచ్చినా.. కొత్త టికెట్ ఇచ్చిన వారికి సిట్టింగ్‌లు సహకరిస్తారనే గ్యారంటీ లేదు. తమ నియోజకవర్గంలో వేరే వాళ్లు గెలిస్తే.. తమకు ప్రాధాన్యం ఏముంటుందని తమ కార్యకర్తలతో చెబుతున్నట్లు తెలుస్తోంది. 


సిట్టింగ్‌లే కాదు ఆశావాహులు సైతం సీటు రాకపోవడంతో జారుకుంటున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో మొదలైన పరంపర తాజాగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు వరకు సాగుతూనే ఉంది. ఇంకా చాలామంది వైసీపీ నుంచి క్విట్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. నెల రోజులుగా ఈ రాజీనామాల తుపాను కొనసాగుతోంది. రాజీనామా చేసిన వారంతా టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నేతలతో టచ్‌లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిని చిత్తు చేయాలంటే.. గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. తనకు అందిన సర్వే నివేదికలను అనుసరించి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. 


Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు


Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook