CM Jagan Mohan Reddy: మా చిన్నాన్నను ఎవరు చంపారో తెలుసు.. వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
CM Jagan Reacts On Ys Viveka Murder: వైఎస్ వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్నను చంపింది ఎవరో ఆ దేవుడికి తెలుసు అని.. బురద జల్లేందుకు ఇద్దరు చెల్లమ్మల్ని ఎవరు పంపించారో మీకు కనిపిస్తోందన్నారు. చిన్నాన్నను అన్యాయంగా ఓడించిన వారితోనే చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతారా..? అని ప్రశ్నించారు.
CM Jagan Reacts On Ys Viveka Murder: కడప జిల్లా పులివెందుల అభ్యర్థిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు. అంతకుముందు స్థానిక సీఎస్ఐ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. 'నా పులివెందులకు .. నా సొంత గడ్డకు.. నా ప్రాణానికి ప్రాణం అయిన ప్రతి పులివెందుల ప్రజలకు మీ బిడ్డ హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు..' అంటూ స్పీచ్ మొదలుపెట్టారు. పులివెందుల అంటే నమ్మకం, ధైర్యం, అభివృద్ది, ఒక విజయగాధ అని అన్నారు. కరువు ప్రాంతంగా ప్రయాణం ప్రారంభించి.. ఎక్కడో కృష్ణా నీటితో అభివృద్ది బాటలో పరిగెడుతోందన్నారు. దీనంతటికీ కారణం మహానేత వైఎస్ఆర్ అని అన్నారు. ఆయన అడుగులకు తోడు తాను ప్రయాణం చేస్తున్నానని చెప్పారు.
"పులివెందులలో ఏముందని ఒకప్పుడు అడిగితే ఇప్పుడు పులివెందులలో ఏమి లేదనే స్దాయికి ఎదిగాము. మన పులివెందుల మనకే కాదు మన రాష్ట్రానికి కూడా ఎంతో ఇచ్చింది. రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకాన్ని ఒక అభివృద్దిని ఇచ్చింది మీ పులివెందుల బిడ్డే. ఆ ఎల్లో మీడియాకు వచ్చే ఊతపదం పులివెందుల కల్చర్, కడప కల్చర్ అని.. యస్ మంచి చేయడం మన కల్చర్, మాటకు లొంగకపోవడం మన కల్చర్, మంచి చేయడం మన కల్చర్. మాటకు నిలబడే గుండే ధైర్యం ఉంది కాబట్టే మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గుండెల్లో పెట్టుకున్నారు. కూటమి మాటలకు తోడు వైఎస్ఆర్ వారసులం అని మాటలు కలుపుతున్నారు.
వైఎస్ఆర్‌పై కక్షపూరితంగా కేసులు పెట్టింది ఎవరు..? రోడ్డున పడేసింది ఎవరు..? వైఎస్ఆర్ కుటుంబం పూర్తిగా రాజకీయాలకు దూరం అవ్వాలని చూసింది ఎవరు..? వైఎస్ పేరు కనపడకుండా చేయాలని చూస్తున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వారసులు. వైఎస్ఆర్ బతికున్నంత కాలం ఎవరితో పోరాటం చేశారో పులివెందుల ప్రజలకు తెలుసు. కుట్రదారులతో కలిసి వారికి మోకరిల్లిన వీరా వైఎస్ఆర్ వారసులు.. వైఎస్ఆర్ విగ్రహాలను ముక్కలు చేస్తామని చెప్పిన వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వారసులు.. ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్‌కు వేసినట్టా..? లేక అక్రమదారులకు ఓటునేసినట్టా తేల్చుకోవాలి..
అందరితో పాటు మాట కలిపారు నా చెల్లెళ్లు.. మా చిన్నాన్నను ఎవరు చంపారు.. ఏమి జరిగిందో ఆ దేవుడికి, ఈ ప్రజలకు తెలుసు.. చంపానని చెప్పి హేయంగా మాట్లాడి రోడ్డుపై తిరుగుతున్న అతనికి మద్దతు ఇస్తుంది మీరు కాదా..? చిన్నాన్నకు రెండవ భార్య మాట ఉంది వాస్తవం కాదా..? ఆమెకు సతానం ఉన్న విషయం వాస్తవం కాదా..? అవినాశ్ ఎవరు ఫోన్ చేస్తే వెళ్లాడో అందరికి తెలుసు.. దిగజారుడు రాజకీయాలు చేస్తుంది ఎవరు..? అవినాశ్ ఎలాంటి తప్పుచేయలేదు. అందుకే టికెట్ ఇచ్చాను. మా అందరికీ కంటే చిన్నపిల్లోడైన అవినాశ్‌ను తెరమరుగు చేయాలని చూడటం దారుణం.." అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Also Read: Renault Kiger Price: టాటా పంచ్‌తో పోటీ పడుతున్న Renault Kiger.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి