CM Jagan With India Today: రాష్ట్రంలో తిరిగి తాము మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని సీఎం జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తన వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నామన్నారు. విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకువచ్చామని.. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించామన్నారు. ఇండియా టుడే సదస్సులో ముఖ్యమంత్రి జగన మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చామని.. తమ ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు నిదర్శనం ఇదేనన్నారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్‌ ఆడుతుందని.. విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని.. అలాగే తమ కుటుంబాన్ని కూడా విభజించారని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు, వాటి అమలు గురించీ మాట్లాడలేవు. ఇదే బడ్జెట్‌ గతంలోనూ ఉంది.. ఇప్పుడూ ఉంది. కానీ అప్పుడు డీబీటీ ఎందుకు జరగలేదు. మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు. చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది లేనే లేదు. సీఐడీని దుర్వినియోగం ఆరోపణలు అర్థరహితం. చంద్రబాబుపై ఆరోపణలు, వాటిపై ఆధారాలు పరిశీలించాకే కోర్టులు నిర్ణయం తీసుకున్నాయి. 


పేదరికాన్ని నిర్మూలించాలంటే అది నాణ్యమైన చదువు ద్వారానే సాధ్యమని నేను నమ్ముతాను. విద్య మాత్రమే కాదు, నాణ్యమైన విద్య అనే ప్రతి ఒక్కరి హక్కుకావాలి. పేదలు ఒక చదువుకు పరిమితమైతే, సంపన్నుల పిల్లలు వేరే చదువులు చదువుతున్నారు. పేద పిల్లలు కేవలం తెలుగు మీడియంకు పరిమితమైతే, సంపన్నుల పిల్లలు ఇంగ్లిషు మీడియం చదువుతున్నారు. సంపన్నులకు అందే నాణ్యమైన చదువులు పేద పిల్లలకూ అందాలి. మా రాష్ట్రంలో పేదపిల్లలకు సంపన్నుల పిల్లలకు అందే చదువులు అందాలన్నదే మా లక్ష్యం.


ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లిషు మీడియం స్కూళ్లుగా మారుస్తున్నామని కొందరు పెద్దలు మమ్మల్ని విమర్శిస్తున్నారు. కానీ నేను ఒక్కటే అడుగుతున్నా.. మీ పిల్లలు, మీ మనవళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు..? వాళ్లు తెలుగు మీడియంలో చదువుతున్నారా..? ఇంగ్లిషు మీడియంలో చదువుతున్నారా..? పిల్లలకు నాణ్యమైన ఇంగ్లిషు విద్యను అదించడంలో సమగ్రమైన విధానాన్ని అనుసరిస్తున్నాం. బై లింగువల్‌ టెక్ట్స్‌ బుక్స్‌ను అందిస్తున్నాం. బైజూస్‌ కంటెంట్‌ పాఠాలను నేర్పిస్తున్నాం. స్కూళ్లలో నాడు–నేడు కింద మంచి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం..


కాంగ్రెస్‌ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్‌ ఆడుతుంది. అది ఆపార్టీ సంప్రదాయంగా చూస్తున్నాం. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు. విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారు. అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు. నేను కాంగ్రెస్‌నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్నకు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు. వారు పాఠాలు నేర్వేలేదు. వారి పార్టీ సారథ్య బాధ్యతలు మా సోదరికి ఇచ్చారు. కాని అధికారం అనేది దేవుడు ఇచ్చేది. దేవుడ్ని నేను బలంగా నమ్మతాను. ఆయనే అన్నీ చూస్తాడు.." అని సీఎం జగన్ అన్నారు. 


ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవని.. వాటి అమలు గురించీ మాట్లాడలేవన్నారు. ఇదే బడ్జెట్‌ గతంలోనూ ఉందని.. ఇప్పుడూ ఉందన్నారు. కాని మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారని.. కాని ఈప్రభుత్వం మాత్రమే చేయగలిగిందన్నారు. చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది లేనే లేదన్నారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణల విషయం కోర్టుకు చేరిందని.. ఆ ఆరోపణలు, ఆధారాలను చూసి కోర్టు నిర్ణయం తీసుకుని రిమాండ్‌ విధించిందని అన్నారు. అలాంటప్పుడు ప్రతీకారం ఎలా అవుతుందన్నారు. సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలను చూస్తాయి కదా..? అని ప్రశ్నించారు. వాటిని చూసి కన్వెన్స్‌ అయితేనే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయన్నారు. రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల ఉనికి పెద్దగా ఉండదని.. తమ పార్టీకి, టీడీపీ-జనసేన మధ్యే పోటీ ఉంటుందన్నారు. 


Also Read: Sharmila fire on Jagan: బీజేపీతో అన్నయ్య కుమ్మక్కు.. సీఎం జగన్‌పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు


Also Read: Parliament Elections: కాంగ్రెస్‌కు మమత భారీ షాక్‌.. బెంగాల్‌లో కటీఫ్‌.. ఢిల్లీలో దోస్తీ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook