CM Jagan Mohan Reddy: రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నగదు జమ
Crop Damage Subsidy: రైతు బాగుంటునే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రైతును అన్నిరకాలుగా ఆదుకుంటూనే ఏ రాష్ట్రమైనా బాగుపడుతుందన్నారు. వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాలను రైతుల ఖాతాల్లో ఆయన జమ చేశారు.
Crop Damage Subsidy: వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాలు మొత్తం రూ.200 కోట్లను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల ఖాతాల్లో జమ చేశారు. రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీ, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీరాయితీ సొమ్ముతో పాటు గతంలో వివిధ సాంకేతిక కారణాల వల్ల చెల్లింపులు పొందని వారి అకౌంట్లలో కూడా నగదు జమ అయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రైతు బాగుంటునే రాష్ట్రం బాగుంటుందన్నారు. దాదాపు 62 శాతం మంది జనాభాకు వ్యవసాయ రంగమే ఆధారమని.. రైతును అన్నిరకాలుగా ఆదుకుంటూనే ఏ రాష్ట్రమైనా బాగుపడుతుందన్నారు. క్రమం తప్పకుండా సున్నా వడ్డీ పంట రుణాలు కరెక్టుగా ఇస్తున్నామన్నారు.
'వ్యవసాయరంగంలో ఇలా చాలా రకాల మార్పులను తీసుకు వచ్చాం.. ఇవాళ బటన్ నొక్కి మొత్తంగా రూ.200 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం.. ఇప్పటివరకు 21.31 లక్షల మంది రైతులకు రూ.1834 కోట్లు ఇచ్చాం. గత రబీ, ఖరీఫ్‌లో రుణాలు చెల్లించిన వారికి 8,22,411 రైతులకు రూ.160.55 కోట్లు ఇస్తున్నాం. అన్నదాతలకు అండగా నిలుస్తూ.. ఈ-క్రాప్ డేటా అధారంగా పారదర్శకంగా సోషల్ ఆడిట్ కోసం జాబితాలు ప్రదర్శించి.. లక్ష రూపాయలలోపు పంటలబీమా చెల్లించిన వారికి క్రమం తప్పకుండా మన ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది..' అని ఆయన చెప్పారు.
చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టిన బకాయిలతో కూడా కలుపుకుని 73.88 లక్షల మంది రైతులకు రూ.1834.55 కోట్లు ఇచ్చామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మన ప్రభుత్వం వచ్చాక ఉచిత పంటల బీమా అమలు చేసిందని.. ఈ-క్రాప్ ద్వారా పంట వేసుకునే ప్రతి రైతుకూ వర్తించేలా ఆర్బీకేకు అనుసంధానం చేసిందన్నారు. విత్తనం నుంచి అమ్మకం వరకూ రైతన్నకు అండగా ఉండే ఆర్బీకేలు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తున్నాయన్నారు. 10,778 రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలోనూ నాణ్యమైన సర్టిఫైడ్ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందిస్తున్నాయని చెప్పారు.
చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సగటున సగం మండలాలు కరువు మండలాలుగానే ఉండేవని.. మన ప్రభుత్వంలో ఒక్క కరువు మండలాన్నీ కూడా ప్రకటించాల్సిన అవసరం లేకుండా పోయిందని అన్నారు సీఎం జగన్. మంచి చేస్తున్న ప్రభుత్వానికి కచ్చితంగా దేవుడి దయ ఉంటుందన్నారు. గత ప్రభుత్వం విపత్తుల సహాయ నిధికి, ధరల స్థిరీకరణ నిధికి కేవలం ఎన్నికల వాగ్దానంగా మాత్రమే చేసిందని.. మన ప్రభుత్వం వీటిని అమల్లోకి తీసుకొచ్చి రైతన్నలకు తోడుగా నిలబడిందన్నారు.
Also Read: Supreme Court: న్యాయశాఖ మంత్రి వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం.. అలాంటి ప్రకటన చేయకూడదు
Also Read: Rishabh Pant: ప్రపంచకప్ సమీపిస్తోన్న వేళ.. ఇలా ఆడితే ఎలా పంత్! శ్రీకాంత్ అసంతృప్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook