CM Jagan Review On Housing Department: రాష్ట్రంలో టిడ్కో ఇళ్లపై టీడీపీ చేస్తున్న దుష్ర్పచారాన్ని తిప్పికొట్టాలని అధికారులు, పార్టీ నేతలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని ఆనాడు టీడీపీ ప్రభుత్వమే పక్కన పెట్టిందని గుర్తుచేశారు. జూన్‌ నాటికి 1.50 లక్షల మందికి ఇళ్లు అప్పగిస్తామని.. మరో 1.12 లక్షల మందికి డిసెంబరు నాటికి అప్పగిస్తామన్న తెలిపారు. గృహ నిర్మాణశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్‌పై పెట్టిన ఖర్చును అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చేయనున్న ఖర్చు వివరాలను కూడా వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2022–23 ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్ కోసం రూ.10,203 కోట్లు ఖర్చు అయిందని.. ఇందులో రోజుకు రూ.28 కోట్ల చొప్పున ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15,810 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రోజుకు రూ.43 కోట్ల చొప్పున ఖర్చు కానుందన్నారు. చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే.. హౌసింగ్‌పై మన రాష్ట్రం చేస్తున్న ఖర్చ అధికమన్నారు. కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా ఈ స్థాయి బడ్జెట్ లేదన్నారు. ఇప్పటివరకు 3,40,741 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. 


శ్లాబ్‌ పూర్తి చేసుకున్నవి.. శ్లాబుకు సిద్ధంచేసినవి 4,67,551 ఇళ్లు ఉన్నాయని.. ఇవి కొన్నిరోజుల్లో పూర్తవుతాయని ముఖ్యమంత్రికి వివరించారు. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. నిర్మాణాల్లో ఉపయోగించే రాయి, సిమెంటు, స్టీలు తదితర సామగ్రిపై పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మొత్తంగా 4529 పరీక్షలు చేశామని.. 2 శాతం మేర లోపాలు కనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకున్నామని అన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడవద్దని మరోసారి సీఎం జగన్ స్పష్టం చేశారు. 


ఇళ్ల నిర్మాణం జరుగుతున్న జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కరెంట్, తాగునీరు సహా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని అధికారులు చెప్పగా.. డ్రైనేజీ వ్యవస్థపై కూడా దృష్టిపెట్టాలన్న సీఎం ఆదేశించారు. ప్రతి ఇంటికీ కూడా సోక్పిట్స్‌ ఏర్పాటు చేస్తున్నామని.. భవిష్యత్తులో వాననీటిని భూమిలోకి ఇంకించేలా చేయడానికి ఇవి ఉపయోగడతాయని అధికారులు వివరించారు.


Also Read: Chandrababu VS Jr NTR: బాబుకు ఎన్టీఆర్ ఫాన్స్ తలనొప్పి.. పక్కలో బల్లెంలా తయారయ్యరుగా?


టిడ్కో ఇళ్ల గురించి సీఎం జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్ల మీద జరుగుతున్న అసత్య ప్రచారం.. విష ప్రచారం అంతా ఇంత కాదన్నారు. వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. టీడీపీ ప్రభుత్వ హాయంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిగా పక్కన పెట్టారని.. ఒక్క లబ్ధిదారునికి కూడా ఇళ్లు ఇవ్వలేకపోయిందని అన్నారు. మన ప్రభుత్వ హయాంలో వాటిని పూర్తి చేస్తూ.. మంచి మౌలిక సదుపాయాలుతో లబ్ధిదారులకు అప్పగిస్తున్నామని పేర్కొన్నారు. టిడ్కో ఇళ్ల రూపంలో లబ్ధిదారులకు రూ.21 వేల కోట్ల విలువైన లబ్ధి చేకూర్చామని.. ఈ వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ లెక్కలను.. ఈ ప్రభుత్వంలో ఖర్చు పెట్టిన లెక్కనుల అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు.


Also Read: Surya Kumar Yadav IPL: సూర్యకుమార్ యాదవ్ నువ్వో తోపు ప్లేయర్.. బ్యాట్‌తోనే సమాధానం చెప్పు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.