CM Jagan Comments On Pawan Kalyan And Chandrababu: ఏనాడో మూతబడిన అతి పెద్ద డెయిరీ.. చిత్తూరు డెయిరీని ఈ రోజు తెరిపించేందుకు నాంది పలుకుతున్నామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. వెల్లూర్‌ సీఎంసీ, వెల్లూర్‌ మెడికల్‌ కాలేజీ పునాది రాయి వేస్తున్నట్లు చెప్పారు. చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ.. భూమి పూజ కార్యక్రమం అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. 1945లో చిల్లింగ్‌ ప్లాంట్‌గా ఏర్పాటైన చిత్తూరు డెయిరీ 1988లో రోజుకు ఏకంగా 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ప్రాసెసింగ్‌ యూనిట్‌గా మారిందని గుర్తుచేశారు. 1989-1993 మధ్యలో సగటున రోజుకు 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్లు ప్రాసెస్‌ చేసేదేని.. కానీ 1993లో ఈ జిల్లా ఖర్మ కొద్దీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కళ్లు పడ్డాయన్నారు. 1992లో తన సొంత డెయిరీ హెరిటేజ్‌ డెయిరీ పురుడు పోసుకున్న తర్వాత చిత్తూరు డెయిరీని నష్టాల్లోకి నెట్టేస్తూ పోయారని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"చిత్తూరు డెయిరీని చెప్పా పెట్టకుండా 2002 ఆగస్టు 31న ఎలాంటి నోటీసు ఇవ్వకుండా మూత వేసే స్థాయికి తీసుకెళ్లారు. రైతులకే కాకుండా ఉద్యోగులకు కూడా వందల కోట్ల బకాయిలు పెట్టారు. 2003 నవంబర్‌ 27న లిక్విడేషన్‌ ప్రకటించేశారు. ఇదంతా తన సొంత డెయిరీ పాల కోసం జరిగిన కార్యక్రమం. హెరిటేజ్‌ డెయిరీ, చంద్రబాబు లాభాల కోసం సొంత జిల్లా రైతుల్ని నిలువునా ముంచేసిన పరిస్థితులు చూశాం. సహకార రంగంలోని అతి పెద్ద డెయిరీ.. చిత్తూరు డెయిరీ నష్టాల్లోకి వెళ్తుంటే ప్రైవేట్‌ హెరిటేజ్‌ డెయిరీ మాత్రం ఇదే కాలంలో లాభాల్లోకి పరుగెత్తుకుంటూ పోయింది. చిత్తూరు డెయిరీ స్థాయిలోనే అమూల్‌ డెయిరీ కూడా ఉండేది. అమూల్‌ డెయిరీ అక్కడి నుంచి మొదలు పెడితే ప్రపంచంలోనే అతి పెద్ద కోఆపరేటివ్‌ డెయిరీగా మారింది. 


20 ఏళ్లుగా మూత పడ్డ ఈ చిత్తూరు డెయిరీని చూసి దానికి జీవం పోస్తానని హామీ ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం ఇదే డెయిరీని 185 కోట్ల బకాయిలు తీర్చి నేడు తలుపులు తెరుచుకుంటున్నాయి.
అమూల్‌ వారు 385 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని చెప్పడానికి సంతోషపడుతున్నా.. లాభాలను ప్రతి ఆరు నెలలకోసారి బోనస్‌ఇచ్చి డెయిరీకి పాలు పోస్తున్న అక్కచెల్లెమ్మలకు లాభాలను పంచిపెట్టే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రూ.150 కోట్లతో తొలి దశలో పనులు మొదలవుతున్నాయి. మరో 10 నెలల కాలంలోనే పాల ప్రాసెసింగ్‌ మొదలవుతుంది. 5 నుంచి ఏడెనిమిదేళ్ల కాలంలో 10 లక్షల లీటర్లు ప్రాసెస్‌ చేసే స్థాయికి పోతుంది.." అని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. 


ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులపై సెటైర్ల వర్షం కురిపించారు ముఖ్యమంత్రి. "చివరికి దత్తపుత్రుడిని కూడా తాను ఏ ఎన్నికల్లో ఎందుకు, ఎప్పుడు ఎలా ప్రజల మీదకు వదులుతాడో తెలియదనేది కూడా చంద్రబాబు నమ్మకం. మనలాగా ఇంటింటికీ వెళ్లడం గానీ, ఫలానా మంచి చేశాం, మంచిని చూసి మాకు ఓటేయండని గడప గడపకూ వెళ్లే పరిస్థితి వీళ్లకెవరికీ లేదు. చక్రాల్లేని సైకిల్‌ ఎక్కలేని ఆయన ఒక నాయకుడు. ఎవరైనా తైలం పోస్తే గానీ గ్లాసు నిండని వ్యక్తి మరో నాయకుడు. ఒకరు వెన్నుపోటు వీరుడు. మరొకరు ప్యాకేజీ శూరుడు. ఇద్దరూ కలిసి ప్రజలను మోసం చేస్తూ 2014-2019 మధ్య ఇద్దరూ ఈ రాష్ట్రాన్ని ఏలారు.." అంటూ కామెంట్స్ చేశారు.


Also Read: AP Pension Scheme: జగన్ సర్కారు శుభవార్త.. త్వరలో రెండో పెన్షన్‌..?   


Also Read: BJP New Presidents: బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయం.. బండి సంజయ్, సోము వీర్రాజు అధ్యక్షులుగా తొలగింపు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook