CM Jagan Sensational Comments: ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా స్వయం సహాయక సంఘాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ సందర్శించారు. తొలి ఏడాది సున్నా వడ్డీ కింద 1,258 కోట్లు చెల్లించామని సీఎం జగన్‌ చెప్పారు. రెండో సంవత్సరం సున్నా వడ్డీ కింద 1096 కోట్లు ఇచ్చామన్నారు. వరుసగా మూడో ఏడాది 1261 కోట్లు చెల్లించినట్టు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. గడిచి మూడేళ్లలో 3,165 కోట్లు అక్కాచెల్లెమ్మలకు చెల్లించామని తెలిపారు. రాష్ట్రంలోని కోటి 2లక్షల 16వేల మంది అక్క చెల్లెమ్మలకు మేలు కలిగిందని సీఎం వైఎస్ జగన్‌ చెప్పారు. చంద్రబాబు పాలనపై ఒంగోలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసిన పరిస్థితులున్నాయని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో ప్రతి ఏడాది అక్కాచెల్లెమ్మలకు భరోసా ఇస్తున్నామన్నారు సీఎం వైఎస్ జగన్. అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందని సీఎం వైఎస్ జగన్‌ హర్షం వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలకు మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేని పరిస్థితి ఉందని మండిపడ్డారు సీఎం వైఎస్‌ జగన్. రాష్ట్రంలో అర్హులైన సంక్షేమ పథకాలు అందిస్తుంటే చంద్రబాబుతో పాటు ఓ వర్గం మీడియా గోబెల్స్‌ ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత పథకాలతో ఆర్థిక వ్యవస్థ విధ్వంసమంటూ చంద్రబాబు&కో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను దుర్మార్గులు, రాక్షసులతో యుద్ధం చేస్తున్నానని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏపీ మరో శ్రీలంకలా మారుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం వైఎస్‌ జగన్‌ ఫైర్‌ అయ్యారు. పేదరికంతో అవస్థలు పడుతున్న వారికి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వీలులేదని దుష్టచతుష్టయం యత్నిస్తోందని సీఎం వైఎస్‌ జగన్ ఆరోపించారు.


జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి. తమ ప్రభుత్వం మంచిది కాదని చంద్రబాబు దత్తపుత్రుడు చెప్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు మంచి జరుగుతుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేని పరిస్థితి ఉందని విమర్శించారు. చంద్రబాబు హయాంలో మహిళలను నట్టేట ముంచారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో 70 శాతం మంత్రి పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామని చెప్పారు. సంక్షేమ పథకాల ద్వారా 35 నెలల వ్యవధిలో 1,36,694 కోట్లు ప్రజల చేతుల్లో పెట్టామని సీఎం వైఎస్ జగన్‌ తెలిపారు. తమ ప్రభుత్వంలో లంచాలకు తావులేకుండా లబ్ధిదారులకు మేలు చేశామన్నారు. ప్రజల ఇబ్బందులే తన ఇబ్బందులుగా భావించానని సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు మంచి జరుగుతున్నా కూడా బాబు పాలననే కావాలని దుష్టచతుష్టయం కోరుకుంటుందని సీఎం వైఎస్ జగన్‌ చురకలు అంటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబులా గాలివదిలేస్తే రాష్ట్రం అమెరికా అవుతుందంటా అని ఎద్దేవా చేశారు.


Also Read: Roamace on Bike Riding: కలికాలం బాబోయ్.. బైక్‌పైనే అన్ని కానిచేస్తున్న లవర్స్!


Also Read: Prashanth Kishor strategy:  కాంగ్రెస్‌కు ప్రశాంత్‌ కిషోర్‌ ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.