CM KCR and CM Jagan condolences on Konijeti Rosaiah death: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సౌమ్యుడిగా, సహనశీలిగా రాజకీయాల్లో రోశయ్య తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan) రోశయ్య మృతికి సంతాపం తెలిపారు. 'పెద్దలు రోశయ్య గారి మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా... సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య గారి మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.' అని సీఎం జగన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోశయ్య మృతిపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)... ఆర్థిక నిపుణుడిగా, పరిపాలనాదక్షుడిగా రోశయ్య మంచి గుర్తింపు పొందారని పేర్కొన్నారు. విద్యార్థి నాయకుడి నుంచి గవర్నర్ వరకూ ఆయన ప్రస్థానం కొనసాగిందని గుర్తుచేశారు. ఏ పదవి చేపట్టినా ఆయన సమర్థంగా నిర్వహించేవారని పేర్కొన్నారు. రోశయ్య మృతిపై చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. 


టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రోశయ్య (Konijeti Rosaiah) మృతి పట్ల ట్విట్టర్‌లో స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి, వ్యక్తిగతంగా తనకూ పూడ్చలేని లోటు అని అభిప్రాయపడ్డారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.


హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రోశయ్య శనివారం (డిసెంబర్ 4) ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను స్టార్ ఆసుపత్రికి తరలించగా... అక్కడే చికిత్స పొందుతూ తుది శ్వాస (Konijeti Rosaiah passes away)విడిచారు. 1968లో రోశయ్య రాజకీయ ప్రస్థానం మొదలైంది. అప్పట్లో వరుసగా మూడుసార్లు ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు. 1989, 2004లలో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1998లో నరసారావుపేట ఎంపీగా పనిచేశారు. 1995-97లో ఏపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 


Also Read: Breaking News: ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూత!


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోశయ్య (Konijeti Rosaiah) 15 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం విశేషం. 1989లో మర్రి చెన్నారెడ్డి హయాంలో, 1991లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో, 1992లో కోట్ల విజయభాస్కర  రెడ్డి హయాంలో, 2004, 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రోశయ్య ఆర్థికమంత్రిగా సేవలందించారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తాను చేపట్టిన పదవులన్నింటికీ రోశయ్య వన్నె తెచ్చారని రాజకీయ ప్రముఖులు గుర్తుచేసుకుంటున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook