Jagan CBN Where Casting Vote: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ఏపీ భవిష్యత్‌కు అతి ముఖ్యమైనవి కావడంతో ఓటేసేందుకు ఏపీ ప్రజలు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలతోపాటు దేశ విదేశాల నుంచి తరలివస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా.. మిగతా పార్టీలన్నీ జట్టుగా కలిసి పోటీ చేసేందుకు ఇక్కడి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రజలంతా తరలివస్తుండగా.. ఆయా రాజకీయ పార్టీల నాయకులు కూడా స్వస్థలాలకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ ప్రముఖులు ఎక్కడ ఓటు వేస్తారా అనేది ఆసక్తికరంగా ఉంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: AP Elections: ఏపీలో ప్రలోభాల పర్వం.. పిఠాపురం, మంగళగిరి, కుప్పం, నగరిలో భారీగా డబ్బులు, కానుకలు


సోమవారం జరుగనున్న పోలింగ్‌ కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పులివెందుకు వెళ్లారు. తాడేపల్లి నివాసం నుంచి సతీసమేతంగా పులివెందులకు వెళ్లారు. రాత్రి పులివెందులలోనే ముఖ్యమంత్రి బస చేస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని భాకరాపురంలో  సీఎం జగన్‌, ఆయన సతీమణి భారతి రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

Also Read: AP Elections: ఏపీలో ప్రలోభాల పర్వం.. పిఠాపురం, మంగళగిరి, కుప్పం, నగరిలో భారీగా డబ్బులు, కానుకలు


 


  • అయితే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మాత్రం తాము పోటీ చేస్తున్న స్థానాల్లో మాత్రం తమ ఓటును తాము వేసుకోవడం లేదు. వేరే నియోజకవర్గాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటుండడం విశేషం.

  • తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటు వేయనున్నారు. ఆయనతోపాటు అతడి కుటుంబ సభ్యులు కూడా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న నారా లోకేశ్‌ కూడా ఉండవల్లిలోనే ఓటు హక్కు వినియోగించుకుంటారని సమాచారం.

  • మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ కాలనీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఉదయం 7 గంటలకు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

  • శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో  కూటమి అభ్యర్థి, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ దంపతులు ఓటు వేయనున్నారు.


వర్షం అడ్డంకి
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేస్తోంది. వర్షం పడే సూచనలు కూడా ఉండడంతో ఆ మేరకు కూడా ఏర్పాట్లు చేస్తోంది. పోలీస్‌, రెవెన్యూ ఇలా అన్ని రంగాల ఉద్యోగులను ఎన్నికల సంఘం వినియోగించుకుంటోంది. ఇప్పటికే ఈవీఎంలు, ఇతర పత్రాలు పంపిణీ పూర్తయ్యింది. దూర ప్రాంతాలకు ముందే ఎన్నికల సామగ్రి ఇచ్చి ప్రత్యేక వాహనాల్లో పంపించారు. అత్యవసరమైతే హెలికాప్టర్‌ సేవలు కూడా ఎన్నికల సంఘం వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter