Odisha Train Accident Updates: రైలు ప్రమాద బాధితులకు సీఎం జగన్ ఎక్స్‌గ్రేషియా.. ఏపీ వాసులను ఆదుకోవాలని ఆదేశం
AP Passengers in Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో చిక్కుకున్న ఏపీ వాసులను వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సేకరిస్తోంది. రెండు రైళ్లలో మొత్తం 695 మంది రాష్ట్రానికి చెందిన వారు ప్రయాణించగా.. వీరిలో 553 మంది సురక్షితంగా ఉన్నారు. 92 మంది ప్రయాణం చేయలేదు. 28 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
AP Passengers in Odisha Train Accident: ఒడిశాలోని బాలోసోర్ సమీపంలో రైలు ప్రమాద దుర్ఘటన, అధికారులు తీసుకుంటున్న చర్యలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్రం నుంచి ఒడిశాకు వెళ్లిన మంత్రి అమర్‌నాథ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. విశాఖపట్నంలో మరో మంత్రి బొత్స సత్యన్నారాయణ నేతృత్వంలో పర్యవేక్షణ కార్యకలాపాల గురించి చెప్పారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైలు ప్రమాద ఘటనలో రాష్ట్రానికి చెందిన వారు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆదేశించారు.
తీవ్రంగా గాపడ్డవారికి రూ.5 లక్షలు ఇవ్వాలని.. స్వల్పంగా గాయపడ్డవారికి రూ.లక్ష చొప్పున ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అందిస్తున్న సహాయానికి అదనంగా ఇది ఇవ్వాలని సూచించారు. బాలాసోర్‌లో నివాసం ఉంటున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి ఒకరు మరణించారని.. ఇది తప్ప రాష్ట్రానికి చెందినవారెవరూ ఈ ఘటనలో మరణించినట్టుగా ఇప్పటివరకూ నిర్ధారణ కాలేదని అధికారులు వెల్లడించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యసదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
ఒడిశా ఘటనలో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటవెంటనే చర్యలు చేపట్టింది. ఘటనా స్థలానికి మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ల బృందాన్ని పంపించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఎంకైర్వీ విభాగాలు ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ సేవల కోసం విశాఖ సహా ఒడిశా సరిహద్దు జిల్లాల్లో ఆసుపత్రులు అలర్ట్‌గా ఉండాలని చెప్పారు. అదేవిధంగా ఒడిశాలో వైద్య సహాయ చర్యల కోసం 10 అంబులెన్స్‌లు పంపించారు. శ్రీకాకుళం జిల్లా 108 అంబులెన్స్ సర్వీసెస్ మేనేజర్ నజీర్ మాట్లాడుతూ.. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించడానికి సహాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంబులెన్స్‌లను పంపించాలని ఆదేశించారని తెలిపారు. గాయపడినవారిని ఆదుకునేందుకు పది అంబులెన్స్‌లు బాలాసోర్ చేరుకున్నట్లు చెప్పారు.
Also Read: Odisha Train Accident News: 316 మంది ఏపీ వాసులు సేఫ్.. ఆ 141 మంది కోసం సెర్చింగ్
ఒడిశా రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 294 మంది దుర్మరణం చెందారు. 1,175 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధప్రదేశ్‌కు చెందిన వారు రెండు రైళ్లలో మొత్తం 695 మంది ప్రయాణించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వీరిలో 553 మంది సురక్షితంగా ఉన్నారని చెప్పారు. 92 మంది ప్రయాణం చేయలేదని చెప్పారని.. మరో 28 మంది ఫోన్లు అందుబాటులోకి రాలేదన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి