CM Jagan Meet With Union Ministers: సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర విద్యుత్‌ శాఖమంత్రి ఆర్‌కే సింగ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అలు అంశాలపై చర్చించారు. ముందుగా పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్‌ బకాయిల అంశాలపై ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపై మాట్లాడారు. సత్వరం ప్రాజెక్టును పూర్తిచేయాల్సి అవసరం ఉందని.. వీలైనంత త్వరగా ప్రాజెక్టు ఫలితాలను అందించేందుకు సహకరించాలని కోరారు. ప్రాజెక్టు పూర్తి నిర్మాణం వ్యయంపై తాజా అంచనాలకు ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్లుగా ఇప్పటికే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. దీనికి ఆమోదం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అడహాక్‌గా నిధులు రిలీజ్ చేయాలని చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన గతంలో చేసిన విజ్క్షప్తి మేరకు రూ.12,911.15 కోట్ల విడుదలకు  ఆమోదం లభించడం సంతోషకరమని నిర్మలా సీతారామన్‌కు సీఎం జగన్ చెప్పారు. అయితే దీన్ని పునఃపరిశీలించి తాజాగా అంచనాలను రూపొందించామని వివరించారు. లైడార్‌ సర్వేప్రకారం అదనంగా 36 ఆవాసాల్లో ముంపు కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని చెప్పిన ముఖ్యమంత్రి.. 2022 జులై నెలలో వచ్చిన భారీ వరదలు వల్ల తలెత్తిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తొలిదశ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేయాల్సిన పనులపై ఈ అంచాలను రూపొందించినట్లు వివరించారు. పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి ఇంకా రూ.17,144.06 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని రిక్వెస్ట్ చేశారు.


పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధుల నుంచి ఖర్చుచేసిన రూ.1,355 కోట్లను రీయింబర్స్‌ చేయాలని నిర్మాల సీతారామన్‌ను కోరారు సీఎం జగన్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలను కూడా తెరపైకి తీసుకువచ్చారు. సుదీర్ఘకాలంగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని.. రూ.7,359 కోట్లను తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని చెప్పారు. 2014 జూన్‌ నుంచి 2017 జూన్ ‌వరకూ సరఫరా చేసిన విద్యుత్‌ ఛార్జీలను ఇప్పటికీ చెల్లించలేదన్న జగన్.. తొమ్మిదేళ్లుగా ఈ సమస్య పెండింగులో ఉందన్నారు. AP జెన్‌కోకు, డిస్కంలకు ఇది తీవ్ర గుదిబండగా మారిందని వివరించారు.


విద్యుత్ బకాయిలు పెండింగ్‌లో ఉండడంతో వివిధ సంస్థలకు చెల్లింపులు చేయలేని పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. వెంటనే ఈ డబ్బు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరారు. ప్రస్తుతం ఈ అంశం తెలంగాణ హైకోర్టులో ఆగిపోయిందని.. ఏపీ విద్యుత్ సంస్థలకు బకాయిలు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను కలిసి.. విద్యుత్‌ రంగంలోని పలు అంశాలపై చర్చించారు.


Also Read: సెంచరీల మోత మోగించిన కాన్వే, రచిన్‌.. ఇంగ్లండ్‌పై కివీస్ ఘన విజయం..


Also Read: Breaking: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం.. లోక్ పోల్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook