YSR Yantra Seva Scheme: రైతులకు సీఎం జగన్ మరో గిఫ్ట్.. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం
CM Jagan Mohan Reddy Distributes Tractors: గుంటూరు జిల్లా చుట్టుగుంట సెంటర్‌లో వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను ప్రారంభించారు సీఎం జగన్. రైతులు వైఎస్సార్ యంత్ర సేవ యాప్ ద్వారా 15 రోజులు ముందుగా బుక్ చేసుకోవాలని చెప్పారు.
CM Jagan Mohan Reddy Distributes Tractors: వైఎస్‌ఆర్ రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను పటిష్టపరుస్తూ రైతన్నలకు మంచి జరిగించాలనే తపనతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రైతులకు అండగా నిలిచి గ్రామస్వరాజ్యం తీసుకువచ్చామన్నారు. ప్రతి ఆర్బీకే సెంటర్‌లో యంత్రాలకు రూ.15 లక్షలు కేటాయించామని.. రైతులకు ఏం అవసరమో వారినే అడిగి అందజేస్తున్నామని చెప్పారు. అతితక్కువ అద్దెతో యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. 15 రోజుల ముందుగానే యంత్రాలను బుక్ చేసుకునేలా వైఎస్‌ఆర్ యంత్రసేవ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. గుంటూరు జిల్లా చుట్టుగుంట సెంటర్ వద్ద వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను శుక్రవారం సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు.
అంతకుముందు రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద రైతులకు కావాల్సినవి అన్ని సమకూరుస్తున్నామని చెప్పారు. ఆ రైతన్నలే గ్రూపు కింద ఫామ్ అయ్యి.. ఆర్బీకే పరిధిలో ఉన్న మిగిలిన రైతులకు కూడా యంత్రాలన్నీ అందుబాటులోకి తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
10,444 ఆర్బీకేల పరిధిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ పరిధిలో రైతన్నలే ఈ వ్యవసాయ పనిముట్లన్నీ అతి తక్కువ ధరకు మిగిలిన రైతులకు అందుబాటులోకి తీసుకొస్తారని తెలిపారు. గ్రామ స్వరాజ్యం అనే పదానికి నిజమైన అర్థం చెప్పే కార్యక్రమం ఈరోజు జరుగుతోందన్నారు.
సీఎం జగన్ ప్రసంగంలోని హైలెట్స్..
==> ఇంతకు ముందు 6,525 ఆర్బీకే స్థాయిలో.. 391 క్లస్టర్ స్థాయిలోనూ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు రైతుల పేరుతో ప్రారంభించా..
==> అక్కడ 3,800 ట్రాక్టర్లను, 391 కంబైన్ హార్వెస్టర్లను, 22,580 ఇతర యంత్రాలను సప్లయ్ చేశాం.
==> ఈరోజు 3,919 ఆర్బీకే స్థాయిలో మిగిలిన వంద క్లస్టర్ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు అన్నింట్లోనూ 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లతో పాటు 13,573 ఇతర యంత్రాలను అందుబాటులో ఉండేటట్లు ప్రారంభిస్తున్నాం.
==> ప్రతి ఆర్బీకే స్థాయిలో కూడా 15 లక్షల రూపాయలు కేటాయిస్తున్నాం.. అక్కడ ఎటువంటి యంత్రాలు కావాలన్నా ఆ రైతుల్నే డిసైడ్ చేయాలని చెబుతున్నాం.. వాళ్లు చెప్పిన దాని ప్రకారం 15 లక్షలతో వారి అవసరాల మేరకు తీసుకొచ్చాం..
==> వరి బాగా పండుతున్న ప్రాంతాల్లో అక్కడ కంబైన్ హార్వెస్టర్ తీసుకురావాల్సిన అవసరం ఉందని అనిపించిన స్థాయిలో 491 క్లస్టర్లను ఐడెంటిఫై చేశాం.
==> ఒక్కొక్క క్లస్టర్ స్థాయిలో ఒక్కో హార్వెస్టర్‌ను 25 లక్షల రూపాయలతో వాళ్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం.
==> 1,052 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆర్బీకేల పరిధిలో ఇవన్నీ తీసుకువస్తున్నాం..
==> గ్రూపులుగా ఫామ్ అయిన రైతులు కేవలం 10 శాతం కడితే చాలు.. 40 శాతం గవర్నమెంటే సబ్సిడీ కింద ఇస్తుంది. మిగిలిన 50 శాతం లోన్ల కింద వెళుతుంది
==> ఆర్బీకే స్థాయిలోనే ఏ రైతు అయినా వాడుకొనేందుకు అతి తక్కువ అద్దెతో ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. వైఎస్సార్ యంత్ర సేవా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
==> 15 రోజులు ముందుగానే రైతన్నలు బుక్ చేసుకోవచ్చు.
==> ఈ ఏడాది అక్టోబర్‌లో 7 లక్షల మంది రైతన్నలకు వ్యవసాయ పనిముట్లను, వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లను అందజేస్తాం.
==> స్ప్రేయర్లు, టార్పాలిన్లు.. ఇలాంటివి కూడా అక్టోబర్ నెలలో పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
Also Read: IND Vs Aus WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హర్భజన్ టీమ్ ఇదే.. ఆ ప్లేయర్ జట్టులో ఉండాల్సిందే..!
Also Read: Telangana Formation Day: ఇదో మైలురాయి.. నా జీవితం ధన్యమైంది: సీఎం కేసీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి