Group-1 and Group-2 Posts In AP: గ్రూప్‌-1, 2 ఉద్యోగార్ధులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభవార్త అందించారు. గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గురువారం ఉదయం అధికారులు ఈ పోస్టుల భర్తీపై వివరాలు అందించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని చెప్పారు. నోటిఫికేషన్‌ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని తెలిపారు. గ్రూప్‌-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు, గ్రూప్‌-2కు సంబంధించి సుమారు 900కిపైగా పోస్టులు, మొత్తంగా 1000కిపైగా పోస్టులు భర్తీ చేయనున్నామన్నారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేయాలని సీఎం ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని చెప్పారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రూప్-1,2 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక ప్రకటన రావడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రిపేరేషన్ పూర్తి చేసుకుని.. నోటిఫికేషన్ల కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అతి త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో సంతోషంగా ఉన్నారు. గ్రూప్‌ 1, 2లో ఏయే పోస్టులను భర్తీ చేయనున్నారు..? సిలబస్‌ ఎలా ఉంటుంది..? వంటి వివరాలను అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. త్వరలోనే పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం జీవోను విడుదల చేయనుంది.


Also Read: Akash Madhwal IPL: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఆకాశ్ మధ్వాల్.. ముంబై ఎంత ఖర్చు చేసిందంటే..?  


Also Read: Hyderabad Woman Murder Case: సంచలనం రేకెత్తిస్తున్న మహిళ హత్య కేసు.. చిన్న క్లూతో నిందితుడిని పట్టేశారు   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook