YSR Rythu Bharosa-PM Kisan Funds: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ నిధులను ఆయన బటన్ నొక్కి విడుదల చేశారు. 3,923 కోట్ల రూపాయలను మొత్తం 52,30,939 మంది రైతుల ఖాతాలో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పంట పండించే సమయానికి రైతన్న ఇబ్బంది పడకూడదని అన్నారు. నాలుగేళ్లలో ప్రతి ఏడాదికి రైతుకు రూ.12,500 ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పామని.. మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా ఎక్కువగా ఈరోజు రూ.13,500 ఇస్తున్నామని చెప్పారు. రైతన్న ఇబ్బందులు పడకూడదని నాలుగేళ్లు కాదు ఐదో ఏడాది కూడా ఇస్తున్నామన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా మరో గుడ్‌న్యూస్ చెప్పారు సీఎం జగన్. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో కురిసిన వర్షాలకు నష్టపోయిన 51 వేల మంది రైతన్నల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా మరో 54 కోట్ల రూపాయలు ఇన్‌పుట్‌ సబ్సిడీగా ఈ రోజే జమ చేస్తున్నట్లు వెల్లడించారు. గత నాలుగేళ్లలో వ్యవసాయ రంగంలో రైతులకు అండగా నిలబడుతూ.. విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు. గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం గొప్ప మార్పు అని అన్నారు. 10,778 రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశామని తెలిపారు. 


గతంలో చంద్రబాబు హయాంలో ఏ సంవత్సరం చూసుకున్నా కరువే కరువు అని ముఖ్యమంత్రి అన్నారు. చంద్రబాబు హయాంలో ప్రతి సంవత్సరం కనీసం సగం మండలాలన్నీ కరువు మండలాలుగా డిక్లేర్‌ చేసే పరిస్థితి ఉండేదన్నారు. గత నాలుగేళ్లలో ఒక్కటటంటే ఒక్కటి కూడా కరువు మండలంగా డిక్లేర్ ‌చేసే పరిస్థితి రాలేదన్నారు. గత పాలనకు ఈ పాలను తేడా గమనించాలని కోరారు.


"ఆర్బీకే స్థాయిలో కూడా సీడ్‌ టెస్టింగ్‌, సాయిల్‌ టెస్టింగ్‌ చేసే దిశగా కూడా అడుగులు పడతున్నాయి. రాబోయే రోజుల్లో గ్రామస్థాయిలో వ్యవసాయం చేసే విధానాన్ని పూర్తిగా మార్చబోతోంది. గ్రామ సచివాలయాలన్నింటిలోనూ అక్కడే సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులను కూడా తీసుకురావాలని అడుగు పడుతోంది. ఎప్పుడూ జరగని విధంగా, ఎవరూ ఊహించని విధంగా రైతన్నలకు భూముల మీద ఉన్న సర్వ హక్కులూ వాళ్లకు ఇప్పించాలని అడుగులు వేస్తున్నాం. 


చుక్కల భూముల మీద, బ్రిటిష్‌ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న భూముల మీద, గత ప్రభుత్వంలో నిషేధిత జాబితాలో పెట్టిన భూముల మీద కూడా సర్వ హక్కులూ రైతులకే ఇస్తూ.. లక్షల ఎకరాల మీద పూర్తి హక్కును కూడా ఇచ్చాం.. వ్యవసాయంలో మొట్టమొదటి సారిగా ఆర్బీకే స్థాయిలోకే డ్రోన్లు తీసుకొచ్చే గొప్ప అడుగులు పడుతున్నాయి. మన రైతులే డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేసే పరిస్థితి కూడా త్వరలోనే రాబోతోంది.." అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.


ఈ సందర్భంగా టీడీపీ నిర్వహించిన మహానాడుపై విమర్శలు గుప్పించారు. రాజమండ్రిలో ఒక డ్రామా కంపెనీ మాదిరిగా ఒక షో జరిగిందని.. ఆ డ్రామా పేరు మహానాడు అనిపేరు పెట్టుకున్నారని సెటైర్లు వేశారు. 27 సంవత్సరాల క్రితం తానే వెన్నుపోటు పొడిచి చంపేసిన మనిషికి.. మళ్లీ తామే ఆ మనిషి యుగపురుషుడని, ఆ మనిషి శకపురుషుడని, ఆ మనిషి రాముడని, ఆ మనిషి కృష్ణుడని కీర్తిస్తూ అదే మనిషికి మళ్లీ ఫొటోకు దండ వేస్తారంటూ విమర్శించారు. 


టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోపై కూడా వ్యంగ్యస్త్రాలు సంధించారు. మేనిఫెస్టో పేరిట ప్రతి ఎన్నికకూ ఒక వేషం వేసే క్యారెక్టర్ చంద్రబాబుది అని అన్నారు. మరోసారి మళ్లీ కొత్త వాగ్దానాలతో జనం ముందుకు వస్తున్నాడని.. కొంగ జపం మొదలు పెట్టాడని ఎద్దేవా చేశారు. ప్రజలు గమనించాలని కోరారు. వాళ్లు చెబుతున్న అబద్ధాలను నమ్మకండని.. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా..? లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.


Also Read: LPG Cylinder Price Cut: నేటి నుంచి కొత్త రూల్స్ అమలు.. గ్యాస్ రేటు తగ్గింపు.. ఆ ధరలు పెంపు   


Also Read: India China Border Clash: చైనా గుట్టురట్టు.. LAC వద్ద రహస్యంగా దళాల విస్తరణ  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , FacebooKమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి