CM YS Jagan Mohan Reddy: ఏపీలో మరో 70 రోజుల్లో ఎన్నికలు.. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ పిలుపు
YSRCP Election Campaign: ఏపీలో మరో 70 ఎన్నికలు రానున్నాయని.. వైసీపీని గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు.
YSRCP Election Campaign: రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. శనివారం భీమిలి నియోజకవర్గంలో 'సిద్ధం' పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మరో 70 రోజుల్లో ఎన్నికలు రానున్నాయని.. చంద్రబాబుతో అందరిని ఓడించాలని పిలుపునిచ్చారు. మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన జగన్.. 175కు 175 స్థానాల్లో గెలుపు వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఒంటరిగే పోటీ చేసే ధైర్యం లేదని.. అందుకే పొత్తుల కోసం చూస్తున్నారని అన్నారు. అందుకే దత్తపుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. గతంలో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావని జోస్యం చెప్పారు.
చేసిన మంచిని నమ్ముకునే మీ బిడ్డ ఎన్నికలకు వెళ్తున్నాడని అన్నారు సీఎం జగన్. అబద్దానికి, నిజానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది అని అన్నారు. చంద్రబాబు 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేదని.. తాము మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేర్చామన్నారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదని గుర్తుచేశారు. 56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించామని.. లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా పాలన చేశామన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికి పింఛన్లు అందజేస్తున్నామని.. రైతులకు తోడుగా ఆర్బీకేలను నిర్మించామన్నారు.
ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకువచ్చామని.. నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశామన్నారు.
"14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మంచి చేయాలనే ఆలోచన లేదు.. చంద్రబాబు సీఎంగా ఉంటే ఏ గ్రామం బాగుపడదు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే. రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే. రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నిలువునా ముంచాడు. రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాం. 3,527 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ ని విస్తరించాం.. ఒక్క వైద్య రంగంలోనే 53 వేల కొత్త నియామకాలు చేపట్టాం.. అందుకే ఎక్కడ చూసినా వైఎస్ జగన్ మార్కే కనిపిస్తోంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం
గత పదేళ్ల మీ బ్యాంకు అకౌంట్లను చెక్ చేసుకోండి. చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి అయినా పడిందా..? మన పాలనలో మీ ఖాతాల్లో రూ.2 లక్షల 53 వేల కోట్లు వేశాం.. ఎన్ని కష్టాలు ఎదురైనా .. అన్ని వర్గాలకు మంచి చేశాం.. రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాం. కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి మనం చేసిన మంచిని చెప్పండి. మీ బిడ్డ నమ్ముకుంది దేవుడిని, మిమల్ని మాత్రమే ప్రజలే .. నా స్టార్ క్యాంపెయినర్లు..
ఈ యుద్దానికి నేను సిద్ధం .. మీరు సిద్ధమా..? ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా..? దుష్టచతుష్టయాన్ని.. గజదొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా..? వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే.. ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి. దుష్టచతుష్టయం సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. మన టార్గెట్ 175 కు 175 అసెంబ్లీ , 25 కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే.." అని సీఎం జగన్ అన్నారు.
Also Read: Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
Also Read: Governor Protest: నడిరోడ్డుపై కుర్చీ వేసుకుని గవర్నర్ ధర్నా.. మీరెందుకు అంటూ పోలీసులపై ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter