చంద్రబాబుపై లోకాయుక్తకు బీసి సంఘం ఫిర్యాదు
చంద్రబాబుపై లోకాయుక్తకు బీసి సంఘం ఫిర్యాదు
హైదరాబాద్: 2014 నుంచి 2019 వరకు కొనసాగిన టీడీపీ పరిపాలనలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు డేరంగుల ఉదయ కిరణ్ ఆరోపించారు. గురువారం లోకాయుక్తను ఆశ్రయించిన ఆయన.. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ఫిర్యాదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందినకాడికి దోచుకుని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు హయాంలో ఇసుక మాఫియా, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఉదయ్ కిరణ్ లోకాయుక్త దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల సొమ్మును లూటీ చేసిన చంద్రబాబు నాయుడు, అప్పటి మంత్రులపై త్వరితగతిన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉదయ్ కిరణ్ లోకాయుక్తకు విజ్ఞప్తిచేశారు. అక్రమాలకు పాల్పడిన వారి నుంచి అక్రమ సంపాదనను ఏపీ ప్రభుత్వం స్వాధీనపర్చుకునేలా చర్యలు తీసుకోవాలని లోకాయుక్తను కోరారు. టీడీపి సర్కార్ హయాంలో అక్రమాలు జరిగాయని, వాటిపై విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ఫిర్యాదుపై అటు లోకాయుక్త, ఇటు టీడీపి ఏమని స్పందిస్తాయో వేచిచూడాల్సిందే మరి.